'మొలక'లెత్తిన రుచి
కూర
కావలసిన పదార్థాలు: మొలకలు (పెసలు, శనగలు, బఠాణీ, పెబ్బర్లు, పల్లీలు మొదలైన వేవైనా) - 250 గ్రా., వెల్లుల్లి పేస్టు -1 స్పూను, నూనె - 1 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ - 1, టమోటా - 1, గరం మసాలా, కారం - 1 టీ స్పూను చొప్పున, పసుపు - పావు టీ స్పూను, పనస గింజలు - 1 కప్పు, ఉప్పు - రుచికి తగినంత, కొత్తిమీర తరుగు - అర కప్పు.
తయారుచేసే విధానం:మొలకల్లో తగినంత నీరు పోసి కుక్కర్లో ఉడికించి పక్కనుంచాలి. నూనెలో చిన్నమంటపై వెల్లుల్లి పేస్టు, ఉల్లి, టమోటా ముక్కలు ఒకటి తర్వాత ఒకటి వేగించి, (ఉడికించి, తొక్కతీసి, ముక్కలు చేసిన) పనస గింజల్ని కలపాలి. తర్వాత కారం, పసుపు, గరం మసాల వేసి మగ్గించాలి. ఇప్పుడు ఉడికించిన మొలకలు (నీటితో పాటు), ఉప్పు కలిపి మరో 6 నిమిషాలు మూత పెట్టి, కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. ఈ కూర అన్నంతో పాటు బ్రెడ్‌పైకి కూడా బాగుంటుంది.
చట్నీ
కావలసిన పదార్థాలు: మెంతి మొలకలు (మెంతుల్ని 14 గంటలపాటు నీటిలో నానబెట్టి, పలచని గుడ్డలో కట్టి, గాలి తగిలే చోట ఉంచితే రెండ్రోజుల్లో మొలకలొస్తాయి) - ముప్పావు కప్పు, నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1 టేబుల్ స్పూను, ఇంగువ - చిటికెడు, పసుపు - 1 టీ స్పూను, బెల్లం - 50 గ్రా., చింతపండు - 50 గ్రా., కారం - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం:మెంతి మొలకల్లో కొద్దిగా నీరు పోసి 2 విజిల్స్ వచ్చేవరకు కుక్కర్లో ఉడికించాలి. నూనెలో ఆవాలు, పసుపు, కరివేపాకు, ఇంగువ, మొలకలు ఒకటి తర్వాత ఒకటి వేగించాలి. తర్వాత ఉప్పు, బెల్లం, చింతపండు గుజ్జు, కారం కలిపి చిన్నమంటపై 8 నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత గాలి దూరని జాడీలో నిలువ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉండే చట్నీ ఇది.
ఫ్రైడ్ రైస్
కావలసిన పదార్థాలు: పెసర మొలకలు - 1 కప్పు, అన్నం - 2 కప్పులు, ఉల్లిపాయ - 1, టమోటా గుజ్జు - అరకప్పు, పచ్చిమిర్చి - 4, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి - 4 రేకలు, మసాలా పొడి - 1 టీ స్పూను, మిర్యాలపొడి - అర టీ స్పూను, మీల్‌మేకర్ (ఉప్పు వేసిన నీటిలో ఉడికించి, వార్చినవి) - పావు కప్పు, షాజీరా - అర టీ స్పూను, దనియాల పొడి - 1 టీ స్పూను, కారం - అర టీస్పూను, పసుపు - చిటికెడు, నెయ్యి - 1 టేబుల్ స్పూను, ఉప్పు - రుచికి తగినంత.
తయారుచేసే విధానం: ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, అల్లం కలిపిపేస్టు చేసుకోవాలి. నెయ్యిలో షాజీరా, మసాలా పొడి, ఉల్లి పేస్టు చిన్నమంటపై దోరగా వేగించాలి. తర్వాత కారం, పసుపు, దనియాలపొడి, టమోటా గుజ్జు వేసి 10 నిమిషాలు తర్వాత పెసర మొలకలు, మీల్‌మేకర్ వేసి 3 నిమిషాలు ఉంచాలి. చివర్లో అన్నం, ఉప్పు, మిరియాలపొడి కలిపి, కొత్తిమీర చల్లి దించేయాలి.

No comments:
Post a Comment