all

Friday, December 7, 2012

బీట్ రూల్ లో దాగున్న టాప్ 6 హెల్త్ బెనిఫిట్స్...!

సహజంగా లభించే పండ్లూ కాయగూరలూ తినడం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తారు పోషకాహార నిపుణులు. అలాంటి వాటిలో బీట్‌రూట్‌ ఒకటి.శక్తినిచ్చే శాకాహారదుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. దీని లాభాలు ఎన్నో తెలుసా! బీట్‌ రూట్‌ లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్‌ ఆక్సైడ్‌ లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి. బీట్‌రూట్‌ రసం తాగిన మూడు గంటలకు రక్తపోటులో తగ్గుదల ఉంటుందనీ, దీనివల్ల అనవసర ఆందోళనను దూరం చేసుకోవచ్చనీ ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. క్రీడాకారులు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగి పరిగెత్తినపుడు తక్కువ ఆక్సిజన్‌ తీసుకుంటారు. అందువల్ల త్వరగా అలసిపోరు. ఓ తాజా పరిశోధన ప్రకారం రోజుకి 400మి.లీ. చొప్పున రెండ్రోజులు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగిన వృద్ధుల్లో మెదడు భాగంలో రక్త ప్రసరణ వేగం పెరిగి ఆలోచనల్లో చురుకుదనం కనిపించింది.
6 reasons eat beetroot

సౌందర్యానికి రూట్‌ విటమిన్‌ బి ఎక్కువగా ఉండే బీట్‌రూట్‌ చర్మం, గోళ్లు, వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు పెదవులు పొడారకుండానూ చూస్తుంది. వీటిల్లోని బీటేన్‌ రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడుతుంది. రోజుకి ఓ చిన్న గ్లాసుడు బీట్‌రూట్‌ రసం తాగితే రక్తపోటు తగ్గటానికి దోహదం చేస్తుంది. నాడుల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, కాలేయం పనితీరు మెరుగుపడటానికీ బీట్‌రూట్‌ తోడ్పడుతుంది. గర్భిణుల్లో ఆరోగ్యకరమైన కణజాలం వృద్ధి చెందేలా చేస్తుంది కూడా..
1. నో ఫ్యాట్: ఇది మరోగ ఆరోగ్యకరమైన ప్రయోజనం ఇందులో ప్యాట్ లేకుండుట. ఇందులో జీర్ స్యాచురేటెడ్ ఫ్యాట్స్ ను కలిగి ఉంటి. ఇందులో చాలా తక్కు స్తాయిలో ఫ్యాట్స్ కలిగి ఉంటడం వల్ల స్వీట్స్ తినాలనే ఆలోచనలను తగ్గిస్తుంది. ఎవరైనీ డైయట్ పాటిస్తున్నట్లైతే బీట్ రూట్ తీసుకోవడం వల్ల స్వీట్ తీసుకొనే అవకాశం రాదు.
2. శక్తినివ్వడానికి బూస్ట్ వంటిది: ఆరోగ్యంగా గడపడానికి శక్తిచాలా అవసరం. అటువంటి శక్తిని అందించడంలో బీట్ రూట్ బాగా పనిచేస్తుంది. ఇందులోని కార్బోహైడ్రేట్స్. మీకు లేజీగా, బద్దకస్తంగా అనిపిస్తుంటే...జస్ట్ బీట్ రూట్ చిన్న చిన్న స్లైస్ గా కట్ చేసి తినడమే. దాంతో తక్షణ శక్తిని పొందగలరు.
3. ఫోలిక్ ఆసిడ్: మహిళలకు ఫోలిక్ యాసిడ్ ఆవస్యకత చాలా ఉంది. ఎందుకంటే వారిలో ఫెర్టిలిటీని పెంపొదించుటలో అందుకు కావల్సిన సప్లిమెంట్స్ ను ఇది పుష్కలంగా అందిస్తుంది. ఫోలిక్ ఆసిడ్ కోసం పిల్స్ తీసుకోవడం కంటే నేచురల్ గా దొరికే ఈ బీట్ రూట్ ను తీసుకొండి ఫోలిక్ ఆసిడ్ పిల్స్ అవసరంలేకుండా చూసుకోండి.
4. న్యూట్రీషియన్స్: చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకు సరైన న్యూట్రిషియన్ ఫుడ్ ను అందించలేదని ఫీలవుతుంటారు. అటువంటప్పుడు పిల్లలకు లంచ్ బాక్స్ లో ఆహారంతో పాటు ఇటువంటి డార్క్ రెడ్ వెజిటేబుల్స్ ను చేర్చడం వల్ల వారి తగినంత శక్తి అందించి, మెదడును చురుగ్గా ఉంచుతుంది. ఇంకా ఇందులో విటమిన ఎ మరియు విటమిన్ సి, బీటైన్, క్యాల్షియం, మినిరల్స్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి బాగా సహయపడుతాయి.
5. గుండె ఆరోగ్యానికి: అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే బీట్‌రూట్‌ రసాన్ని తాగండి. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్‌ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది.
6. బీట్ రూట్ జ్యూస్: ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పుడు బీట్‌రూట్‌ రసం తాగితే త్వరగా కోలుకుంటారు. బీట్‌రూట్‌లో కేవలం నైట్రేట్లు మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలూ దండిగా ఉంటాయి. శరీరం క్యాల్షియాన్ని వినియోగించుకోవటంలో తోడ్పడే సైలీషియా సైతం ఉంది. బీట్‌రూట్‌కు ఎరుపు రంగుని కలిగించే బీటాసైయానిన్‌కు పేద్దపేగుల్లో క్యాన్సర్‌తో పోరాడే లక్షణం ఉంది.

No comments: