థాయ్ చిల్లీ ఫిష్ చాలా పాపులరైన సీఫుడ్. ఈ సైడ్ డిష్ ను ఉడికించిన అన్నం, న్యూడిల్స్, లేదా ఇండియన్ బ్రెడ్స్ మంచి కాంబినేషన్. ఈ థాయ్ చిల్లీ ఫిష్ కు ఎక్కువగా స్పైసీలను(మసాలా దినుసులను) ఉపయోగిస్తారు. ఈ థాయ్ ఫిష్ ను ఫ్రై చేసుకోవచ్చు లేదా గ్రిల్ చేసుకోవచ్చు. ఈ స్పైస్ థాయ్ చిల్లీ ఫిష్ ను ఫిష్ చిల్లీ సాస్ తో తయారు చేస్తారు. ఈ థాయ్ ఫిష్ చూడటానికి జ్యూసీగా ఉంటూ నాన్ వెజ్ ప్రియులకు నోరూరేలా చేస్తుంది. ఈ థాయ్ చిల్లీ ఫిష్ లో అధికంగా ప్రోటీనులు, న్యూట్రీషియన్స్ ఉంటాయి. కాబట్టీ మనం కూడా తయారు చేసుకొని తినేద్దాం...
కావాల్సిన పదార్థాలు:
పెద్ద చేప: 1
థాయ్ రెడ్ చిల్లీ: 2 (chopped)
ఉల్లిపాయలు: 2 (finely chopped)
వెల్లుల్లి: 4-5 pods (chopped)
కొత్తిమీర: 2 (chopped)
ఫిష్ సాస్: ½ cup
చింతపండు గుజ్జు: ¼ cup
పంచదార: 4tbsp
వెజిటేబుల్ ఆయిల్: ½ cup
ఉప్పు: రుచికి సరిపడా
నీళ్ళు: కొద్దిగా
గార్నిషింగ్ కోసం:
కొత్తిమీర తరుగు: కొద్దిగా
రెడ్ పెప్పర్: 1/2(సన్నగా కట్ చేసినవి)
తయారు చేయు విధానం:
1. ముందుగా చేపకు ఉప్పు, పసుపు వేసి బాగా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. చేప మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు. లేదా అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు. శుభ్రం చేసిన చేపను మీడియం సైజ్ లో కట్ చేసుకొని, ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి.
2. తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నూనె తీసుకొని, వేడి చేయాలి, నూనె వేడయ్యాక అందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగ, గార్లిక్, వేసి మీడియం మంట మీద రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి.
3. తర్వాత మంట తగ్గించి పంచదార, ఫిష్ సాస్, చింతపండు గుజ్జు వేసి, రెండు టేబుల్ స్పూన్ల నీరు కలిపి బాగా కలపాలి. తర్వాత తక్కువ మంట మీద ఉడికించాలి. చిక్కబడిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
4. ఇప్పుడు ప్రైయింగ్ పాన్ లో నూనె వేసి వేడి చేసి అందులో చేపముక్కలను వేసి నిదానంగా ఫ్రై చేయాలి. చేపముక్కలు బ్రౌన్ కలర్ కు మారే సమయంలో వాటిని తీసి పేపర్ టవల్లో వేసి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత ముందుగా తయారు చేసి, చల్లారబెట్టిన సాస్ ను వేయించి పెట్టుకొన్న మొతం చేప ముక్కల మీద పోయాలి. అంతే థాయ్ చిల్లీ ఫిష్ తినడానికి రెడీ. దీన్ని కొత్తిమీర, రెడ్ పెప్పర్ తో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి

No comments:
Post a Comment