all

Friday, December 7, 2012

మహిళల బ్యూటీ కిట్ లో ఉండాల్సిన కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్

అందం.. ఆనందం.. ప్రతి మహిళ కోరుకొనేవి. టీనేజ్ గర్ల్ దగ్గర నుండి యాభై ఏళ్ళ వయస్సు గల మహిళల వరకూ తమ అందం గురించి ఎంత కొంత శ్రద్ద తీసుకొంటూనే ఉంటారు. అందుకోసం వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇంకా సౌందర్యంగా కనిపించడానికి మార్కెట్ లో కనిపించే ప్రతి కొత్త బ్యూటీ ప్రొడక్ట్స్ ను కొనుగోలు చేస్తూ వినియోగిస్తుంటారు. కొన్నింటి అవసరం ఉన్నా వాటి అవసరం మనకు లేదని పక్కన పెట్టేస్తుంటారు. అయితే సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రతి మహిళ, టీనేజ్ గర్ల్ దగ్గర తప్పని సరిగా కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ (బ్యూటీ ఎసెన్షియల్స్) ఉండాలి. వీటితో మేకప్ లేకుండానే అందంగా. ఆకర్షనీయంగా కనిపించవచ్చు. మరి మీ బ్యూటీ కిట్ లో ఆ బ్యూటీ ఎసెన్షియల్స్ ఏం ఉండాలో చూద్దామా....
beauty products that every girl needs

చేతులకు మరియు బాడీ లోషన్: ఇది అన్నివిధాలుగా ఉపయోగపడే బాడీలోషన్. శరీరంలో మెత్తానికి అప్లై చేయవచ్చు. చాలా సార్లు మనం ఎక్కువగాఫేస్ కు మాత్రమే మాయిశ్చరైజర్ ను ఉపయోగిస్తుంటాం. స్నానం చేసిన తర్వాత చేతులకు, శరీరానికి బాడీలోషన్ ను అప్లై చేయాలి.
ఫేస్ క్రీమ్: శరీరం మొత్తంలో ముందుగా కనబడేది ముఖం, ముఖం అందంగా కనబడాలంటే చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోవాలి. కాబట్టి బయటకు వెళ్ళే ముందుముఖానికి ఫేస్ క్రీమ్ ను అప్లై చేయాలి . అందుకు ఏదైనా స్పెషల్ క్రీమ్ ను అప్లై చేయాలి. మీరు లోషన్ కూడా ఉపయోగించవచ్చు. అయితే క్రీమ్ లా, చిక్కగా ఉన్నటువంటివి ఉపయోగించడం వల్ల చర్మానికి లేయర్ ఫేషియల్ గా ఉపయోగపడుతుంది .
ఫేష్ వాష్: ఇది మగవారికి ప్రత్యేకం. ఎందుకంటే ఎవరైతే మగవారు వారి ముఖానికి సోపు మరియు యాంటీ సెప్టిక్ లిక్వడ్ తరచూ ఉపయోగిస్తుంటారో. వారికి బాగా పనిచేస్తుంది. ఇక ఎప్పుడూ ఫ్రెష్ గా కనబడాలనే ప్రతి మహిళా ఈ ఫేష్ వాష్ క్రీమ్ ను తప్పనిసరిగా తమ కిట్ లో ఉంచుకోవాలి. బయట మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్ ఉపయోగం లేదని అనుకుంటాం. అయితే ముఖ చర్మం చాలా సున్నితంగా , చాలా పలచగా ఉండటం వల్ల మంచి క్లెన్సర్ గా ఉపయోగపడుతుంది.
ఫేషియల్ స్ర్కబ్: ఫేష్ వాష్ తో మాత్రమే డెడ్ స్కిన్ మరియు బ్లాక్ హెడ్స్ తొలగిపోవు. కాబట్టి స్టెక్చర్ స్ర్కబ్ వల్ల మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. కాబట్టీ సిలికా లేదా సాండ్ లేని ఫేస్ స్ర్కబ్ ను ఉపయోగించడం మంచిది. దీనికి నేచురల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగించాలి.
స్కిన్ టోనర్ : ముఖానికి ఫేస్ స్క్రబ్ చేసుకొన్న తర్వాత, చర్మరంద్రాలు తెరచుకొంటాయి. శుభ్రమైన ఆ చర్మ రంద్రాలు తిరిగి మూసుకొనేలా చేయడానికి స్కిన్ టోనర్ ను ఉపయోగించాలి. లేదంటే అందులో దుమ్ము, ధూళి చేరి మొటిమలు, జిడ్డు ఏర్పడటానికి దారి తీస్తుంది.
ఫూట్ క్రీమ్: శరీరానికి బాడీ లోషన్ ఉపయోగపడదు. ఎందుకంటే ముఖ చర్మం చాలా పలుచగా ఉంటుంది. కాలు చర్మం మందంగా ఉండటం వల్ల ఫూట్ క్రీమ్ ముఖానికి, ఫేస్ క్రీమ్ పాదాలకు ఉపయోగపడదు. కాబట్టి పాదాలకు సపరేట్ ఫూట్ క్రీమ్ ను ఉపయోగించాలి. ఇక కాళి పగుళ్ళఅసహ్యంగా కనబడకూడదనుకొనే వారు మంచి ఫూట్ క్రీమ్ ను ఉపయోగించాలి.
క్లెన్సింగ్ లోషన్: చర్మాన్ని శుభ్రపరచడానికి చాలా రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. పాలతో క్లెన్సింగ్ చేయడం వల్ల మేకప్ ను తొలగించడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. రెగ్యులర్ గా మేకప్ వేసుకోవడం వల్ల చర్మం పొడిబారడం, లేదా జిడ్డుగా మారుతుంది కాబట్టి క్లెన్సింగ్ మిల్క్ వల్ల చర్మం ఆయిల్ బాలెన్స్ రీస్టోర్ చేస్తుంది. కాబట్టి ఈ బ్యూటీ ప్రొడక్ట్స్ లో ప్రతి గర్ల్స్ బ్యూటీ కిట్ ఉండాల్సిందే..

No comments: