బేబీకార్న్‌ని లేత మొక్కజొన్న కంకులు అని కూడా అంటారు. కంకి తొలిదశ ఉన్నప్పుడే మొక్కనుంచి వేరుచేస్తారు. వీటిని ఉడికించి లేదా పచ్చిగానైనా తినవచ్చు. బేబీకార్న్‌ని ఆసియా వంటకాలలో ముఖ్యంగా థాయ్ డిషెస్‌లో విరివిగా ఉపయోగిస్తారు.
బేబీకార్న్‌లో క్యాలరీలు తక్కువ, ఫోలెట్, ‘బి’, ‘సి’ విటమిన్లు, పొటాషియమ్, పీచుపదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. కొవ్వులేని బలవర్ధకమైన ఆహారంగా బేబీకార్న్‌కు పేరుంది. దీంట్లో ఉండే విటమిన్ ‘సి’ వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి బ్రాంకైటీస్, ఆస్తమా, శ్వాసకోశసమస్యలు తగ్గుముఖం పడతాయి.
బేబీకార్న్‌లో ఉండే తీపి పదార్థం వల్ల తేలికగా జీర్ణమవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగు తుంది. దీన్ని నమిలి తినడం వల్ల దంతా ల పటుత్వం పెరుగుతుంది. పిల్లల ఎదుగుదలకూ, ఎముకల బలానికి ఉపయోగపడే క్యాల్షియం బేబీకార్న్‌లో ఉంది. మానసికంగా ఒత్తిడికి లోనైనప్పుడు బేబీకార్న్‌ను సలాడ్ రూపంలో తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. బేబీకార్న్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి. ఊబకాయం సమస్య దరిచేరదు. ఫలితంగా మధుమేహం బాధించదు.
ఎంపిక ఇలా...
బేబీకార్న్‌ని కొనుగోలు చేసేముందు లేత పసుపులో ఉన్నది, మెత్తగా లేనిది చూసి తీసుకోవాలి. మొక్క నుంచి వేరు చేశాక మూడు రోజులలోపల బేబీకార్న్‌న వండితే పోషకాలు కోల్పోవు.
బేబీకార్న్‌ని ఉడికించేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు వేయాలి.
రెండు నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉడికించకూడదు.
బేబీకార్న్‌ను ఎక్కువ సేపు ఉడికిస్తే రంగు, రుచి మారుతుంది. ఉడికిన వెంటనే వేడినీటిని వడబోసి, చల్లటి నీళ్లు పోయాలి.
బేబీకార్న్‌ని ముక్కలుగా తరిగి సలాడ్స్, సూప్, మాంసాహార వంటకాల్లోనూ వాడవచ్చు. వంటకాలకు బేబీకార్న్ ప్రత్యేకమైన రుచిని తీసుకువస్తుంది.

No comments:
Post a Comment