పిల్లల దగ్గు ఎలా నివారించాలి? పిల్లలలో సాధారణంగా చలికాలంలో దగ్గు వస్తూ వుంటుంది. దగ్గినపుడు ఊపిరితిత్తులలో వున్న మృతకణాలు బయటకు వచ్చేస్తూంటాయి. పిల్లలలో దగ్గు జలుబు, జ్వరం మొదలైనవి వచ్చినపుడు సహజంగా వస్తుంది. అది వచ్చిన ఒకటి లేదా రెండు వారాల్లో తగ్గకపోతే, బ్రాంకైటిస్ లేదా న్యూమోనియాకు దారితీస్తుంది. ఇటువంటపుడు డాక్టర్‌ను వెంటనే సంప్రదించి తగిన మందులు వాడండి.
తాగేందుకు గోరువెచ్చని నీటిని ఇవ్వండి. డాక్టర్ సలహాపై హెర్బల్ టీ కూడా తాగించవచ్చు. ద్రవపదార్ధాలు అధికంగా ఇవ్వాలి. వెజిటబుల్ సూప్ వంటివి డీహైడ్రేషన్ తగ్గిస్తాయి. ఇన్‌ఫెక్షన్ కారణంగా బాధపడే శరీరానికి మంచి ఎనర్జీ ఇస్తాయి. పాలు తాగిన వెంటనే దగ్గుతుంటే, కొద్ది రోజులు పాలు పట్టకండి. ఇవి ఎలర్జీ కలిగించి దగ్గు అధికం చేస్తాయి. పిల్లలలో వచ్చే దంత సమస్యలు - ఈ కాలంలో పిల్లలకు కొన్ని దంత సమస్యలు కూడా అధికంగా వస్తాయి. పిల్లలలో దంత క్షయాన్ని అరికట్టాలంటే, ముందుగా వారికి చేతనయ్యేటంతవరకు పెద్దవారే వారి దంతాలు ప్రతిరోజూ రెండు సార్లు బ్రష్ చేయాలి. కాల్షియం అధికంగా వుండే ఆహారాలైన పాలు, గింజలు మొదలైనవి ఇస్తే వారికి మంచి దంత సంరక్షణ కలుగుతుంది.
కేవిటీలు రాకుండా వుంటాయి. పిల్లల దంతాలు కేవిటీలు లేకుండా ఆరోగ్యంగా వుండాలంటేవారికి ఆరోగ్యక రమైన బ్రేక్ ఫాస్ట్ క్రమం తప్పకుండా ప్రతిరోజూ తినిపించాలి. పిల్లలు చిన్నవారుగా వున్నపుడే వారికి దంతాలను ఎలా సంరక్షించుకోవాలనేది నేర్పాలి. ప్రతిరోజూ రెండు సార్లు బ్రషింగ్ చేయాలని, సంవత్సరా నికొకసారి దంతాలను దంత వైద్యుడివద్ద పరీక్షింపచేయాలని తెలుపాలి. పిల్లలలో దంతాలకు తరచుగా కేవిటీలు ఏర్పడతాయి. వీటిని నివారించాలంటే తీపి పదార్ధాలు, కూల్‌డ్రింకులు వంటివి వారికి భోజనానికి భోజనానికి మధ్య ఇవ్వరాదు. భోజనం లేదా స్నాక్స్ వంటివి నిర్దేశిత సమయాలలో ఇవ్వాలి. దంత సంరక్షణ ఆహారాలైన తాజా పండ్లు, కూరగాయలు, జున్ను, గట్టిగా నమిలే కాయలు వంటివి తినిపించాలి. వివిధ రకాల బ్రషింగ్ ఛార్టులు, దంత సంరక్షణా ఫొటోలు వంటివి చూపుతూ వారిలో దంత సంరక్షణ పట్ల అధిక అవగాహన చిన్నతనంలోనే కలిగించాలి.
No comments:
Post a Comment