all

Friday, December 7, 2012

మిక్స్చ్‌ర్ పొట్లం


వాటా ఇవ్వాల్సిందే!


"ఇదేం విడ్డూరమయ్యా? సుబ్బారావు నాకిచ్చిన ఫీజులో సగం నీకు చెల్లించాలా? ఏం తమాషాగా ఉందా? ఎందుకివ్వాలి?'' కోపంగా అరిచాడు డాక్టర్ దైవాధీనం. "ఆ సుబ్బారావుగాడి కాలు విరగ్గొట్టింది నేనే కాబట్టి'' కూల్‌గా చెప్పేడు అప్పారావు.

బోషాణంలోనే వాడి ప్రాణం
"మీకు ఉన్న మతి పోయినట్టుంది. పిసినారి నాంచారయ్యని తీసుకురమ్మంటే, ఈ బోషాణం పట్టుకొచ్చారేంటి?'' గర్జించాడు యమధర్మరాజు. "ఈ బోషాణం లేకుండా అడుగు కదపనని మొరాయించాడు ప్రభూ. అందుకే దీన్ని ముందు తీసుకొచ్చాం. దీని అనుసరిస్తూ వెనకే వస్తున్నాడు వాడు'' చెప్పారు యమ భటులు.

వ్యాపారం వ్యాపారమే
"సంవత్సరం క్రితం లక్ష రూపాయలు దొంగలెత్తుకు పోయాయని కంప్లెయింట్ ఇచ్చి, ఆరు నెలలు తిరక్కుండానే లక్షన్నర అంటావా?'' కోపంగా అరిచాడు యస్సై గోవిందం. "మరి ఈ ఆర్నెల్ల వడ్డీ ఎవరిస్తారండి?'' అడిగాడు వ్యాపారి కనకయ్య.

తప్పించుకు తిరుగువాడు ... సుమతీ!
"కంపెనీ నీకు సెల్‌ఫోన్ ఎందుకిచ్చింది - స్విచ్ఛాఫ్ చేసి పెట్టుకోడానికా?'' కయ్యిమన్నాడు బాస్ బంగారయ్య. "నేనెప్పుడూ స్విచ్ఛాఫ్ చేయనండి'' బదులిచ్చాడు విఠల్. "పైనుండి అబద్ధాలొకటీ. నిన్న ఎన్నిసార్లు నీకోసం ట్రై చేశాను. ఎప్పుడు చేసినా 'స్విచ్డ్ ఆఫ్ ... ప్లీజ్ కాల్ లేటర్' అని వచ్చింది ...'' బుసకొట్టాడు బంగారయ్య. "అది నా మొబైల్ డయిల్ టోన్ సార్'' చెప్పేడు విఠల్!!

అంతకంటే బాగా ఏడవగలను
"చూడు, భర్త పోయినందుకు ఆమె ఎలా ఏడుస్తోందో పాపం. అతడిపై ఎంతో ప్రేమ ఉంటే తప్ప అలా ఏడవలేరు ...'' సినిమా చూస్తూ, పక్కనే ఉన్న భార్య చెవిలో గుసగుసలాడాడు చెంగాల్రావు. "మీరు పోతే, ఆవిడకంటే ఎక్కువే ఏడుస్తాను డబ్బులు కూడా తీసుకోకుండా. పందెం ...'' కళ్లు తిప్పకుండా తెర కేసి చూస్తూ అంది అలివేలు.

No comments: