all

Friday, December 7, 2012

భుజం నొప్పి పోయేదెలా..?

 
నేడు చాలా మంది భుజం నొప్పితో బాధించపడుతున్నారు. నిత్య జీవితంలో ఏ పని చేయాలన్నా భుజంలోని కీలు కదలికతోనే చేయాల్సి ఉంటుంది. భుజం కీలులో మార్పు రావడంతో నొప్పి ఆరంభమై పనులు చేయటం కష్టంగా మారుతుంది.

Shouaభుజం నిర్మాణం చూసినట్లయితే చేతి పైఎముక (హ్యూమరస్‌) చివరి భాగం బాల్‌లా గుండ్రంగా (కార్టిలేజ్‌) ఉంటుంది. ఇది భుజపుటెముక (స్కాప్యూలా) చివరగా ఉండే ఒక సాకెట్‌లా ఉండే గ్లినాయిడ్‌లో అమరి ఉంటుంది. ఈ కప్‌ లాంటి అమరికతో చేయి కీలు అన్ని పక్కలకు సులువుగా కదులుతూ ఉంటుంది.ఈ నిర్మాణంలో భుజ పుటెముక (స్కాప్యూలా) స్థిరంగా ఉండి కండరాలు, టెండెన్స్‌ సహాయంతో చేయి కీలును గట్టిగా పట్టి ఉంచుతూ భుజం కదలికకు సహకరిస్తుంది.

భుజం నొప్పికి కారణాలు:
  • భుజంపై చేయి కీలు (హ్యూమరస్‌)లోని ‘కార్టిలేజ్‌’లో మార్పు రావడం.
  • భుజం కప్‌ ప్రాంతంలో చీలిక రావడం.
  • భుజపుటెముక ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం.
  • అనుకోకుండా భుజానికి దెబ్బ తగలడం వంటి కారణాల వల్ల భుజం నొప్పి వస్తుంది.

    లక్షణాలు:
    Shoa
  • భుజం కదలిక కష్టంగా మారుతుంది, చేయిని పైకి ఎత్తలేకపోవడం.
  • చేయితో వస్తువులను పట్టుకోవాలన్నా, రాత రాయాలన్నా భుజం నొప్పి వస్తుంది.
  • కంప్యూటర్ల కీ బోర్డ్‌ వాడాలన్నా నొప్పి వస్తుంది.
  • నొప్పి భుజం నుండి మొదలై చేతిలోకి వ్యాపిస్తుంది.
  • రాత్రిపూట నిద్రలో కూడా నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

    జాగ్రత్తలు:
  • భుజం నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఆటలు ఆడటం, బరువులు ఎత్తుడం చేయకూడదు.
  • నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు సుమారు ఒక వారం పాటు విశ్రాంతి తీసుకోవడం వలన నొప్పి తీవ్రత తగ్గుతుంది.
  • భుజం నొప్పి తగ్గడానికి పెయిన్‌ కిల్లర్లు అతిగా వాడకూడదు.
  • చేయి కదలికలకు సంబంధించిన వ్యాయామాలు చేసేటప్పుడు ‘ఫిజియోథెరపీ’ వైద్యుల సలహా తీసుకోవాలి.

    Showపరీక్షలు:
    ఎక్స్‌రే, ఎమ్‌.ఆర్‌.ఐ లాంటి పరీక్షలు భుజం నొప్పి తీవ్రతను తెలుపుతాయి.
    చికిత్స:
    భుజం నొప్పి లక్షణాలను, వ్యక్తిత్వ లక్షణాలను పరిగణలోకి తీసుకొని వైద్యం చేస్తే భుజం నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
    మందులు:
    మెర్కుసాల్‌: గనేరియా, సిఫిలిస్‌ల్ని అణగదొక్కడం వల్ల కీళ్ల సమస్యతో పాటు భుజం నొప్పి వచ్చినప్పుడు ఈ మందు బాగా పని చేస్తుంది. భుజం నొప్పి రాత్రి వేళలో ఎక్కువగా ఉండటం గమనించదగిన లక్షణం.

    బ్రయోనియా: వీరికి భుజంలో కదలికల వలన బాధలు ఎక్కువగానూ, విశ్రాంతి వల్ల తగ్గుటం గమనించదగిన లక్షణం. వీరికి దాహం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ మలబద్ధకంతో బాధపడుతుంటారు. మానసిక స్థాయిలో వీరు ఇంటిపైనే ఎక్కువగా బెంగపెట్టుకొని ఉంటారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు వాడుకోదగినది.

    రస్టాక్స్‌: భుజం నొప్పి మొదటి కదలికలో అధికంగా ఉండి తరువాత కదలికలో నొప్పి తీవ్రత తగ్గుతూ ఉండటం గమనించ దగిన ముఖ్య లక్షణం. వీరికి రాత్రి పూట బాధలు ఎక్కువగా ఉంటాయి. చల్లటి, తేమతో కూడిన వాతావరణం వీరికి సరిపడదు. అను కోకుండా బెణకటం వలన వచ్చే భుజం నొప్పికి ఈ మందు బాగా పనిచేస్తుంది.
    హైపరికం: భుజపుటెముక మధ్య సులువుగా కదిలేందుకు ఉపయోగపడే కార్టిలేజ్‌లో వచ్చే మార్పుల వలన నాడులు ఒత్తిడికి గురై వచ్చే భుజం నొప్పికి, అలాగే ఎడమ చేతికి లేదా కుడి చేతికి వ్యాపించి బాధించే కండరాల నొప్పికి ఈ మందు ప్రయోజనకారి.
    ఆర్నికా: పడటం వలన భుజం ప్రాంతంలో కముకు దెబ్బలు తగలడం, బెణకడం వలన నొప్పి ఉంటే ఈ మందు వాడుకోదగినది. అలాగే శారీరక శ్రమ అనంతరం భుజం నొప్పి వేధిస్తుంటే ఈ మందు వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.

    Sridhaఈ మందులే కాకుండా రూటా, కాల్కేరియాకార్బ్‌, సల్ఫర్‌, కాలికార్బ్‌, కోలోసింత్‌, మాగ్‌ఫాస్‌, సింఫైటినం వంటి మందులను లక్షణ సముదాయంను పరిగణ లోకి తీసుకొని వైద్యం చేస్తే భుజం నొప్పి నుండి విముక్తి పొందవచ్చు.

    -డా పావుశెట్టి శ్రీధర్‌
    హోమియోఫిజీషియన్‌
    అంజనా హోమియో హెల్త్‌కేర్‌
    హన్మకొండ,
    వరంగల్‌

Email|Print|

No comments: