all

Friday, December 7, 2012

కార్న్ ఉప్మా- వింటర్ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్

కార్న్ ఉప్మా కొంచెం కొత్త . మన సాంప్రదాయ వంటకం ఉప్మా లాగనే తయారు చేసే ఈ ఉప్మా సేమియా, రవ్వతో తయారు చేసినట్లే చేయాలి. అయితే ఇందులో ఉడికించిన కార్న్(మొక్కజొన్న) వేసి మిక్స్ చేయాలి. ఇది మరింత రుచిగా ఉండటం కోసం క్యారెట్, పచ్చిమిర్చి, బంగాళదుంప తురుముతో నోరూరిస్తూ వింటర్ చలిని మరిచిపోయేలా దీని టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు కాబట్టి మీరు తయారు చేసేయండి మరి....
winter special corn upma

కావల్సిన పదార్థాలు:
స్వీట్ కార్న్: 1cup
బొంబాయి రవ్వ: 1cup
నీళ్ళు : 2cup
ఉప్పు: రుచికి సరిపడాలేదా తురుము కోవాలి
టమోటో: సన్నగా తరుగుకోవాలి.
బంగాళదుంప :1 (తురుముకోవాలి)
క్యారెట్: సన్నగా తరగాలి
ఉల్లిపాయ: 1 -2 (సన్నగా తరగాలి)
కొత్తిమీర : చిన్న కట్ట
నూనె : సరిపడా
పోపుకోసం:
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1/4tsp
శెనగపప్పు: 1/4tsp
జీడిపప్పు: 5-8
పచ్చిమిర్చి: 4-6
అల్లం: చిన్న ముక్క
కరివేపాకు: రెండు రెమ్మలు
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక అందులో పోపు దినుసులు, ఉల్లిపాయ, ముక్కలు వేయాలి.
2. అవి వేగిన తర్వాత బంగాళదుంప తురుము, క్యారెట్ తురుము, టమోటో ముక్కలు, కార్న్, బొంబాయి రవ్వ, ఉప్పు వేసి రెండు నిమిషాల పాటు సన్న మంట మీద వేయించాలి.
3. అంతలోపు మరొక పాత్రలో నీటిని మరిగించి వేగిన రవ్వలో పోసి కలుపుతూ ఉడికించాలి. చివరగా తరిగిన కొత్తిమీర వేసి కలిపి దించేయాలి.

No comments: