all

Friday, December 7, 2012

ఇరుకింటికి ఇవీ చిట్కాలు

 
మన ఇల్లు ఎంతో విశాలంగా... చూడటానికి ఆకర్షణీయంగా ఉండాలని కోరుకుంటాం. ఇంటికొచ్చే బంధుమిత్రులకు ఇంటీరియర్స్‌లో మన అభిరుచిని పరోక్షంగా తెలియజేయాలని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో.. ఇల్లు మరీ చిన్నదిగా ఉండటం వల్ల ఇది సాధ్యం కాకపోవచ్చు. చిన్న చిన్న గదులూ విశాలంగా కన్పించే మార్గమే లేదా? ఇందుకోసం ఎలాంటి చిట్కాలను పాటించాలి?

Homaఇంట్లోకి ప్రసరించే వెలుతురు వల్ల ఒక గది విశాలం లేదా ఇరుకిరుగ్గా కనిపిస్తుంది. వెలుతురు పద్దెగా సోకని గదులు చిన్నవిగా... మరీ ఇరుగ్గా కనిపిస్తాయి. ఖరీదైన లైటింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసు కున్నా... సూర్యచంద్రుల నుంచి వచ్చే వెలుగు ముందు ఇది దిగదుడుపే? ఇంట్లోకి ధారాళంగా వెలుతురు కావాలంటే పెద్దపెద్ద కిటికీలు పెట్టించుకోవడం ఒక మార్గం. ముఖ్యంగా ఉత్తరం వైపు ఎక్కువగా కిటికీలు ఉంటే మంచిది. తూర్పు, పశ్చిమ దిశల్లో మాదిరిగా ఉత్తరం నుంచి వెలుతురు పెద్దగా రాకపోవచ్చు.ఏ గది అయినా విశాలంగా కన్పించాలంటే ఇంట్లో ఏర్పాటు చేసిన ఫర్నిచర్‌పై దృష్టిపెట్టాలి. కంటికి ఆహ్లాదంగా కపిపించే లేత రంగుల ఫర్నిచర్‌ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ముదురు రంగుల్ని వాడటం ఈ మధ్య ఫ్యాషన్‌ అయినప్పటికీ గదులు విశాలంగా కనిపించటానికివి ఉపయోగపడవు.

వెలుగులు విరజిమ్మే రంగులను పరిమితంగా వాడుతూ... ఎర్గ్‌షేడ్స్‌తో తయారైన వాటిని ఎంపిక చేసుకోవడం మేలు.పెద్దగా వెడల్పు లేనవి... చిట్టిపొట్టి కాళ్ళతో ఉండే ఫర్నిచర్‌ను వాడితే ఇంట్లో ఖాళీ ఎక్కువ కన్పిస్తుంది. కంటికి విశాలంగా కన్పిస్తుంది. సౌకర్యంగా కూర్చోవటానికి ఉపయోగించే కుషన్లయినా కంటికి నప్పేవి, ఇట్టే ఆకట్టుకునే రంగులున్నవి ఎంచుకోవాలి. చూడగానే జిగేల్‌మనిపించే రంగుల బదులు ఈ తరహా వాటికే అధిక ప్రాధాన్యమివ్వాలి. డిజైన్లు గజిబిజిగా ఉండకూడదు. నిలువు లేదా అడ్డ చారలతో ఉంటే ఉత్తమం. ఫర్నీచర్‌ మరీ ఎత్తు వెడల్పు లేకుండా చూసుకోండి. ఒక గదిలో కనీసం యాభై శాతమైనా ఖాళీగా ఉండేలా చూసుకోండి. అంటే మిగతా యాభై శాతంలోనే ఫర్నీచర్‌, ఇతరత్రా వస్తువుల్ని అమర్చు కోటానికి ప్రయత్నించండి. యాభై శాతం స్థలం ఖాళీగా ఉంటే ఇల్లంతా బోసిగా కన్పిస్తుందనే సందేహం మీకు కలగొచ్చు. ఇలాంటప్పుడేం చేయాలంటే...

ఇండోర్‌ ప్లాంట్లు, టెర్రాకోటా శిల్పాలు వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. ఇంటికి రంగులు వేయాలంటే... చాలా మంది ముదురు రకాలను ఎక్కువగా ఎంచుకుంటారు. మనగది విశాలంగా కన్పించాలంటే ఇవి పనికి రావని గుర్తుంచుకోండి. అలాగని మరీ లేతరంగుల్ని వాడితే ఇల్లంతా వెలవెలబోతుంది. మనం చేయా ల్సిందల్లా... జిగేలుమన్పించే రంగులను నప్పే ప్రాంతాల్లోనే వాడాలిజ ఇంట్లో వాడే ఫర్పీషింగ్స్‌ విషయం లోనూ కొంత దృష్టి సారించాలి. సోఫా, కుషన్‌ కవర్‌, సీట్‌, దివాన్‌ కవర్‌, బెడ్‌షీట్లు వంటివి ముదురు రంగుల బదులు లేత రంగులవి ఎంచుకోండి. వీలైనంత వరకూ కర్టెన్లను తక్కువగా ఉపయోగించండి. వీటికి బదులు బెండ్లు వాడటం మంచి ప్రత్యామ్నాయం. ఇందులోనూ రకాలకు కొదవే లేదు. అతి తక్కువ బడ్జెట్‌లో లభించే రకాలను ఎంచుకోండి.

No comments: