.కారణాలు:
- సరెైన పోషక ఆహారం తీసుకోకపోవడం.
- మెదడులో కణుతులు ఏర్పడటం వల్ల మెదడుకు సోకే ఇన్‌ఫెక్షన్స్ వలన
- థయామిన్ లోపం వలన
- మెదడుకు ఆక్సీజన్, గ్లూకోజ్ సరిగా అందని పరిస్థితుల్లో
- తలకు బలమైన గాయాలు తగలడం వలన
- కొన్ని రకాల మత్తు పదార్థాలను అధికంగా వాడటం వలన (ఆల్కహాలు వంటివి)
- థెైరాయిడ్ లోపం
- మానసిక ఒత్తిడికి అధికంగా గురికావడం
- వస్తువులు ఎక్కడ పెట్టామో గుర్తుకు రాకపోవడం.
- కొందరు కొన్ని విషయాలు ఒకటి రెండు రోజులు తర్వాతనే మరచిపోవడం.
- కొంతమంది గృహిణులు బజారుకు వెళ్ళిన తర్వాత ఇంటికి తాళం వేసామో, లేదో, గ్యాస్ ఆఫ్ చేసామో లేదో అని ఆందోళన పడటం వంటి లక్షణాలు ఉంటాయి.
లక్షణాలు:
సరెైన సమయంలో చదివింది గుర్తుకు రాకపోవడం.
ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు తమకు జ్ఞాపకశక్తి లోపించిదేమో అని ఆందోళన చెందడం సహజం. అలా కాకుండా చేసే పని మీద దృష్టి సారించి ఏకాగ్రతతో చేయుట భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వలన మానసికి ఒత్తిడి లేకుండా జీవనాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తే ‘జ్ఞాపకశక్తి’ మెరుగు పడుతుంది.
చికిత్స:
హోమియోలో జ్ఞాపకశక్తి లోపాన్ని నివారించడానికి అద్భుతమైన మందులు ఉన్నాయి. ఈ మందులను ఎన్నుకునే ముందు వ్యక్తి మానసిక, శారీరక అలవాట్లను పరిగణలోకి తీసుకోవాలి. అలాగే జ్ఞాపకశక్తి లోపానికి గల కారణాలెైన భయం, మానసిక ఒత్తిడి, నెగటీవ్ ఆలోచనలు ఉంటే వాటి నుండి బయట పడేందుకు కౌన్సిలింగ్ ఇప్పించాలి.
మందులు:
ఎనకార్డియం: జ్ఞాపకశక్తి లోపానికి ఈ మందు బాగా పని చేస్తుంది. పిల్లలు చదివింది పరీక్షలకు ముందు గుర్తుకు రాక బాధపడుతుంటారు. ఇటువంటి వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
బెరెైటాకార్బ్: ముసలి వారు, ఎక్కువ బలహీనంగా ఉన్న వారు మతి మరుపుతో బాధపడుతుంటారు. వీరికి మానసిక వికాసం తక్కువ. అలాగే జ్ఞాపకశక్తి లోపంతో పాటు పిల్లల్లో ఎదుగుదల లోపించి మరుగుజ్జుగా ఉన్నట్లయితే ఈ మందును వాడుకొని ప్రయోజనం పొందవచ్చు.
సల్ఫర్: వీరు పేర్లను మరిచిపోతారు. వీరికి మానసిక శక్తి తక్కువ, బద్ధకస్తులు. వీరు మతి మరుపుతో పాటు, చర్మ వ్యాధి, మలబద్ధకంతో బాధపడుతుంటారు. వీరికి పరిశుభ్రతపెై పట్టింపు ఉండదు, అపరిశుభ్రంగా ఉంటారు. వీరు చూడటానికి సన్నగా ఉంటారు. కుదురుగా ఒక చోట నిలబడలేరు, వంగి నడుస్తుంటారు. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
ఎకోనెైట్: వీరు తేదీలను మరిచిపోతారు. మానసిక ఒత్తిడి వల్ల, టెన్షన్ల వల్ల జ్ఞాపకశక్తి తగ్గినట్లయితే ఆరంభ దశలో ఈ మందు బాగా పని చేస్తుంది. అలాగే వీరు చల్ల గాలిలో తిరగడం వలన ముక్కు బిగుసుకొనిపోయి, తుమ్ములు, గొంతు నొప్పి వెంటనే ప్రారంభమవుతాయి. వీరికి ఆందోళన, దాహం విపరీతంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉండి జ్ఞాపకశక్తి లోపంతో బాధపడే వారికి ఈ మందు ఆలోచించదగినది.
సిక్యుట విరోస: వీరు మందమతులు. వీరి పేరును సైతం మరిచిపోతారు. చివరకు తమ ఇంటి నెంబరును, ఫోను నెంబరును కూడా మరిచిపోతారు. ఇలాంటి వారికి ఈ మందు బాగా పని చేస్తుంది.ఈ మందులే కాకుండా ఎతూజ, ఎసిటిక్ ఆసిడ్, స్టాఫిసాగ్రియా, కాల్కేరియాఫాస్, కాలిఫాస్ వంటి మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి డాక్టర్ సలహా మేరకు మంచి ఫలితం ఉంటుంది.
No comments:
Post a Comment