మీకు స్వీట్స్ ఇష్టమా? మరి, ఐస్‌క్రీమ్ అంటే ప్రాణమా? అవుననే కదా అన్నారు! మరి ఆ ఐస్‌క్రీమ్‌లోకి మంచి కాంబినేషన్ ఏంటో చెప్పండి! మ్... గులాబ్‌జామ్..! కరెక్టే! ఇంకా.? ఖుబానీ కా మీఠా! ఎస్! వెనిల్లా ఐస్‌క్రీమ్‌లో ఖుబానీ కా మీఠా జోడించి అలా అలా మెల్లగా ఆస్వాదిస్తుంటే... ఓV్‌ా..! ప్రపంచాన్ని మరిచిపోవడం మామూలేగా! అన్నట్లు, ఖుబానీ కా మీఠా అనగానే రంజాన్ గుర్తుకొస్తుంది కదూ!
విదేశీ పండ్లు వెల్లువెత్తడంతో ఖుబానీలు(ఆప్రికాట్లు) మార్కెట్లో లభ్యమౌతున్నాయి. అయితే, ఖుబానీలు డ్రై ఫ్రూట్స్‌గా మనకు ఎక్కువగా దొరుకుతుంటాయి. ఇందులోని సుగుణాలేంటంటే...
- మూడు ఆప్రికాట్లు తింటే కేవలం 50 కేలరీలు వస్తాయి.
- ఆప్రికాట్‌లలో విటమిన్ ఎ, సి, ఇలు ఉన్నాయి. రోజుకు 2-3 ఆప్రికాట్లు తింటే ఆ రోజుకు మన శరీరానికి కావాల్సిన విటమిన్ ఎ దొరికినట్లే!
- అవికాక పొటాషియం, ఐరన్, బీటా కెరోటిన్ పుష్కలంగా వున్నాయి.
- ఆప్రికాట్లు కంటికి, గుండెకు చాలా మేలు చేస్తాయి.
- ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. అవి మన రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి.
- ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.

No comments:
Post a Comment