all

Friday, December 7, 2012

కఠిన మరకలను సులువుగా వదిలించే నెయిల్ పాలిష్ రిమూవర్

నెయిల్ పాలిష్ రిమూవర్ బ్యూటీ ప్రొడక్ట్ మాత్రమే కాదు, వేళ్ళకు ఉన్నటువంటి నెయిల్ పాలిష్ ను తొలగించడమే కాదు ....ఈ స్ట్రాంగ్ నెయిల్ పాలిష్ రిమూవర్ అనేక రకాలైనటువంటి ఇతర ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. గ్లాసీ నెయిల్ పాలిష్ ను తొలగిస్తుంది. ఇంకా ఈ సాల్వెంట్ దుస్తుల మీద పడ్డ కఠిన మరకలను లేదా దుస్తులకు అంటుకొన్న స్టిక్ ఐటెమ్స్ ను తొలగిస్తుంది. నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంకా గ్లూ రిమూవర్ గా కూడా పనిచేస్తుంది . చేతికి అంటుకొన్న స్ట్రాంగ్ గ్లూను సులభంగా తొలగిస్తుంది. గ్లాసుఐటమ్స్ కు ఉన్న స్టిక్కర్స్ తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ హ్యాండీ అసిటోన్ బ్యాటిల్స్ ను క్లీనింగ్ కోసం ఉపయోగించవచ్చు. మరి మరికొన్ని ఉపయోగాలు తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని చదావల్సిందే....
uses a nail polish remover

గ్లూ తొలగించడానికి: నెయిల్ పాలిష్ రిమూవర్ తో ఇదొక మంచి ఉపయోగం. గ్లూ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది . చర్మానికి అంటుకొన్న దాన్ని తొలగించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా కఠినమైన సూపర్ స్ట్రాంగ్ గ్లూను తొలగించడానికి నెయిల్ పాలిష్ రిమూవర్ ను ఉపయోగించవచ్చు. గ్లూను తొలగించడానికి చేతిని ఉపయోగించనవసరం లేదు అలా చేయడం వల్ల చేతుల చర్మానికి హాని కలగవచ్చు. కాబట్టి కాటన్ బాల్స్ ను అసిటోన్ లో డిప్ చేసి, చేతికి అంటుకొన్న గ్లూ మీద రుద్ది మ్యాజిక్ చూడండి చిటికెలో మాయం అవుతుంది. ఇంకా స్టిక్కర్ కు ఉన్న గమ్ ను గ్లాసు మీద తొలగించాలంటే కొద్దిగా నెయిల్ పాలిష్ రిమూవర్ గమ్ మరకల మీద రాసి పోగొట్టవచ్చు.
చైనా మట్టింతో తయారు చేసిన వస్తువుల మీద మరకలను తొలగిస్తుంది: చైనా మట్టితో తయారు చేసి వస్తువులకు అంటుకొన్న పసుపు లేదా నూనె మరకలను అతి సులభంగా తొలగించడానికి కాటన్ బాల్స్ ను నెయిల్ పాలిష్ రిమూవర్ లో ముంచి తర్వాత మరకల మీద రుద్దడం వల్ల కొద్ది నిముషాల్లోనే మరకలు లేని పాత్రలను మీరుపొందవచ్చు.
టైల్స్ క్లీనింగ్: మీ ఇంట్లో టైల్స్ చాలా డర్టీగా మారి ఉంటే .. చూడటానికి చాలా అసహ్యంగా ఉన్నా అటువంటి ప్రదేశంలో కొద్దిగా నెయిల్ పాలిష్ రాయడం వల్ల దుమ్ము, దూళిఏర్పడ్డ మరకల్నీ మాయం అయిపోతాయి.
బేస్డ నెయిల్ పాలిష్ రిమూవర్:
ఇంక్ (సిరా )మరకల్ని అతి సులభంగా పోగొడుతుంది: ఇంక్ మరకలను పోగొట్టడానికి వివిధ రకాల ఉపాయలే ఉన్నాయి . ఇంక్ మరక ఉన్న ప్రదేశంలో నీళ్ళు, సోపు, వేయడం వల్ల ఆ ప్రదేశంలో బ్లూ లేదా బ్లాక్ లేదా రెడ్ కలర్ లోనికి మారిపోతుంది. కాబట్టి నెయిల్ పాలిష్ రిమూవర్ అప్లై చేయడం వల్ల ఈ మరకలను తొలగించడానికి చాలా సులభం అవుతంది .
పర్మనెంట్ మార్కర్ పెన్ మరకలను తొలగించడానికి: సాధారణంగా ఆఫీస్ బోర్డ్ మీద మనం ఉపయోగించేటటువంటి పర్మనెంట్ మార్కర్ పెన్ తో గ్లాస్ మీద పెయింటింగ్ చేయడం వల్ల భయపడాల్సిన పనిలేదు. నెయిల్ పాలిస్ రిమూవర్ తో సులభంగా తొలగించవచ్చు.దానికి నెయిల్ పాలిష్ రిమూవర్ ను కొద్దిగా రాస్తే సరిపోతుంది. తొలగిసోతుంది.
మెటల్ ప్రొడ క్ట్స్ : మెటల్ తో తయారు చేసినటువంటి వస్తువులు చాలా త్వరగా తుప్పు పడుతుంటాయి. దాంతో తుప్పు, ఫన్ గూ, మరియు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. కాబట్టి మెటల్ వస్తువులు మిలమిల మెరవడానికి ఇదొక చక్కటి అవకాశం. కాబట్టి నెయిల్ పాలిస్ ను ఉపయోగించే ఇటువంటి చిన్నచిన్న ప్రయోజనాలను గ్రహించండి..

No comments: