all

Friday, December 7, 2012

చెన్నా బిర్యానీ - వెజిటేరియన్ స్పెషల్

చాలా మంది వెజిటేరియన్స్ పులావ్, బిర్యానీ వంటివి నాన్ వెజిటేరియన్స్ మాత్రమే అనుకుంటారు. పులావ్ రిసిపి నాన్ వెజ్ తో తయారు చేసి బిర్యానీ మాదిరే ఉంటుంది. అయితే చెన్నా పులావ్ కూడా ఇండియన్ రైస్ డిష్. ఇందులో చాలా న్యూట్రీషియన్స్ కలిగినటువంటి బిర్యానీ. ఈ పులావ్ కు కాబూలీ శెనగలను ఉపయోగిస్తే మరింత టేస్ట్ గా ఉంటుంది. ఈ స్పైసీ పులావ్ మొఘలాయి ఫ్లేవర్ ను కలిగి ఉంటుంది. పులావ్ అంటేనే బాస్మతి రైస్ తో తయారు చేస్తారు. బాస్మతి రైస్ ను ఉపయోగించడం వల్ల నాన్ వెజ్ బిర్యానీలా ఘుమఘులాడుతుంటుంది. ఇందులో నెయ్యి, పులావ్ మసాలాతో మరింత రుచి, వాసనతో ఘుమఘులాడే ఈ కాబూలీ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం..
chana pulao biryani vegetarians

కాబూలీ శెనగలు: 1 cup
నెయ్యి: 2tbsp
జీలకర్ర: 1tsp
పెప్పర్(మిరియాలు): 6
లవంగాలు: 5
చెక్క: 1inch
బ్లాక్ కార్డమమ్: 1 (cracked)
బాస్మతి రైస్: 2 cups
ఉల్లిపాయలు: 1 ?(sliced)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
టమోటో: 1 (chopped)
పచ్చిమిర్చి: 2 (chopped)
కారం: 1/2tsp
పులావ్ మసాలా: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా కాబూలీ శెనగలను రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం వండే ముందు కుక్కర్ వేసి శుభ్రం చేసి, ఒకటి లేదా రెండు కప్పుల నీరు పోసి రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. తర్వాత అందులో జీలకర్ర మరియు పెప్పర్, లవంగాలు, యాలకులు, చెక్క వేసి రెండు నిముషాల పాటు వేయించుకోవాలి.
3. రెండు నిముషాలు వేయించిన తర్వాత అందులో పచ్చిమిర్చి మరియు ఉల్లిపాయలు వేసి మరో ఐదు నిముషాలు వేసి తక్కువ మంట మీద వేయించాలి.
4. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు మూడు నిముషాలే వేయించాలి.
5. తర్వాత అందులోనే టమోటో, కొద్దిగా ఉప్పు చేర్చి బాగా వేయించాలి. టమోటో మెత్తబడిని తర్వాత అందులో ఉడికించిన కాబూలీ శెనగలను, నీరు వంపేసి అందులో వేయిస్తున్న మిశ్రమంలో వేసి దాంతో పాటు కారం, పులావ్ మసాలా వేసి ఉడికించాలి.
6. రెండు మూడు నిముషాలు ఉడికించిన తర్వాత శుభ్రం చేసిన బాస్మతి రైస్ వేసి మూడు కప్పుల నీళ్ళు పోసి మూత పెట్టి పదిహేను నిముషాల పాటు ఉండికించాలి . అంతే సర్వ్ చేయడానికి చెన్నా పులావ్ రెడీ .. సర్వ్ చేసే ముందు కొత్తిమీర, పుదీనా ఆకులతో గార్నిష్ చేయాలి.

No comments: