అప్పట్లో విజ్ఞానవేత్తల అంచనాలకు అందకుండా ఉండేది కాలేయ పనితీరు. బాబిలోనియన్స్ కాలేయం రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది, కాబట్టి ఆత్మ ఇక్కడే ఉంటుందనుకునేవారు. గ్రీకులు ఆత్మ ఎక్కడో ఉంది, కానీ కాలేయం నల్లటి బైల్ రసం పసుపు పచ్చటి బైల్ రసాలని ఉత్పత్తి చేస్తాయని భావించారు. శరీరం సరిగా పని చేయడానికి కాలేయం ముఖ్య పాత్రని నిర్వహిస్తోందని తెలుసుకోగలిగారు. క్రమంగా కాలేయం ఆరోగ్యంగా లేకుండా బతకలేమని తెలుసుకోగలిగారు.
కడుపులో కోన్ ఆకారంలో, ముదురు ఎరుపు రంగులో, మెత్తగా ప్రకాశిస్తూ స్పాంజ్‌లా ఉండే కాలేయం ఎవరికైనా శరీర బరువులో 2-3% మధ్యలో ఉంటుంది. కడుపులో కుడిభాగాన, ఉదర వితానం కింద ఉరః పంజరంలో ఉంటుంది.
కాలేయ నిర్మాణం
కాలేయంలో మూడవ వంతున్నా అది చేసే పనులన్నీ చేయగల్గుతోంది. అలాగే రెండు, మూడు నెల్లో అది మామూలు పరిమాణానికి పెరగగలదు. కాలేయం ‘బెల్ రసాన్ని’ ఉత్పత్తి చేస్తుంది. కొవ్వులు, విటమిన్లు ఆహారంలో ఉన్న వాటిని పూర్తిగా జీర్ణం చేయడానికి ఈ రసం తోడ్పడుతుంది. ఈ బెైల్ రసం కాలేయం నుంచి ‘బెల్‌డక్ట్’ అనే నాళం ద్వారా ఆహార నాళంలో డుమోడినమ్ ప్రాంతంలోకి పంపుతుంది.
కాలేయ ప్రత్యేకతలు
కాలేయంలో 70% దెబ్బతిన్నా మిగిలిన భాగం అన్ని పనుల్నీ నిర్వర్తించగలదు. చనిపోయే వరకూ పెరిగే ఏకైక అవయవం కాలేయం. మూడో భాగం మిగిలి మిగతాది తెగిపోయినా, రెండు నెల్లో ఉన్న కాలేయం పూర్తి స్థాయికి పెరుగుతుంది.
కాలేయ అనారోగ్యాలు
కాలేయ సింథటిక్ ఫంక్షన్ దెబ్బ తినడంతో రక్తస్రావం, కామెర్లు, ఎన్‌కెఫలోపతి లాంటి అనారోగ్యాలు కలుగవచ్చు. విసర్జన పని దెబ్బ తినడంతో కామెర్లు పుట్టుకతో రావచ్చు. బలియరీ ఎట్రేషియా అంటారు. లేకపోతే పెద్దయిన తర్వాత గాల్‌స్టోన్స్, కంతులు రావచ్చు. వీటిని తొలగించడానికి లాప్రోస్కోపిక్ సర్జరి చేయాల్సి రావచ్చు. సిర్రోసిస్ వల్ల రక్తప్రసరణలో అడ్డంకులేర్పడితే ‘పోర్టల్ హైపర్‌టెన్షన్’ కలుగవచ్చు. రక్తవాంతులు కావచ్చు, కడుపులో నీరు చేరడాన్ని ఎసైటిస్ అంటారు.
లక్షణాలు
కాలేయ సమస్యలుంటే కడుపులో కుడి భాగంలో నొప్పి, జ్వరంతో వణికిపోవడం, కామెర్లు, శరీరంలో నొప్పులు, ఆకలి లేకపోవడం, ముదురు రంగులో మూత్రం, పేల్ మలం, ఎసైటిస్, కాళ్ళవాపులు, రక్తవాంతులు, దురదలు, కోమా వస్తాయి.
సాధారణ కాలేయ అనారోగ్యాలు
కాలేయం ఫెయిలెైతే మార్పిడి శస్తచ్రికిత్స ఒక్కటే మార్గం. ఎన్‌కెఫలోపతి రక్తస్రావంచ ఎసైటిస్ ముదిరినా కాలేయ మార్పిడి చేయాలి. కాలేయం సిర్రోసిస్ లాంటి అనారోగ్యంలో శరీరం మీద ఎరట్రి మచ్చలు ఏర్పడవచ్చు. ఛాతీ పెైభాగంలో సాలెగూడులో ఉబ్బెత్తున కనిపిస్తాయి. శరీరం దురదలు, నల్లబడడం, ఇబ్బందికరంగా ఉండడం, నీరసం, పెదాల రంగు మారుతుంది. నల్లటి మచ్చలు రావచ్చు. ఈ లక్షణాలన్నీ కాలేయ మార్పిడితో మారిపోతాయి. కాలేయం భాగం బంధువుల నుంచి తీసుకోవచ్చు. అలా కొంత భాగం కాలేయాన్ని కాలేయం ఫెయిలెైన వాళ్ళకు ఇవ్వడంతో రెండు నెలల్లో ఆ యొక్క కాలేయం పూర్తిస్థాయికి పెరుగుతుంది. అలాగే దానం చేసిన వాళ్ళ కాలేయ భాగం పూర్తి స్థాయికి పెరుగుతుంది.
విధి వక్రిస్తే రేపు స్వీకర్తలమూ కావచ్చుగా? ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలీయదు కాబట్టి అందరం దాతలమైతే అవసరమైన వాళ్ళకు కావలసిన అవయవాలు లభ్యమవుతాయి. కాయాన్ని బూడిద చేయడమో, మట్టిలో కలపడమో చేయడం బదులు మరికొందరికి అవయవదానంతో ప్రాణాలివ్వగలగడం గొప్ప విషయం కదూ!? బ్రెయిన్ డెత్ అయిన తర్వాత అవయవాలు ఉపయోగపడాలన్నా అవి ఆరోగ్యాంగా ఉండాలి. అందుకే ఆరోగ్యంగా ఉండడానికి అందరూ సరెైన జాగ్రత్తలు తీసుకోవాలి.
కాలేయ విధులు
కాలేయం చేసే పనులుల 500కి పెైగా ఉన్నాయి. అల్బ్యుమిన్ లాంటి ప్రొటీన్లను తయారు చేస్తుంది. రక్తాన్ని గడ్డకట్టించే పదార్థాల్ని తయారుచేస్తుంది. రక్తంలోని విషపదార్థాల్ని తొలగిస్తుంది, ఫిల్టర్‌లా వ్యర్థ పదార్థాల్ని తొలగిస్తుంది, డ్రైనేజ్‌లా. కాలేయం ఉత్పత్తి చేసే బెైల్ రసం ఈ పనిని నిర్వర్తిస్తుంది. జీర్ణమైన ఆహారంలోంచి పోషకాలను స్వీకరిస్తుంది. గ్లూకోజ్ ఎక్కువగా ఉంటే గ్లైకోజిన్‌గా మార్చి నిల్వ ఉంచుతుంది, స్టోరేజ్ ఆరాన్‌లో. శరీరంలోని రసాలు వ్యర్థంగా బయటకు వెళ్తుంటే ఆపి, వెనక్కి ఆయా భాగాల్లోకి పంపేస్తుంటుంది కాలేయం, సెక్యూరిటీ గార్డ్‌లా.
No comments:
Post a Comment