all

Friday, December 7, 2012

ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. ఇలా బరువు తగ్గించుకోండి

కొంతమంది వయస్సు ఎంత ఉన్నప్పటికీ మూడు పదులు దాటనట్లే కనిపిస్తారు. అంతేకాదు యువతకంటే ఎంతో చురుకుగా పనిచేస్తుంటారు. అదే మరికొందరూ ఎంత తిన్నప్పటికీ నీరసం, అలసట వంటివాటితో బాధపడుతుంటారు. ఆఫీసుకు వెళ్లినప్పటికీ కూనికిపాట్లు పడుతుంటారు. నిస్సత్తువుగా ఉంటారు. ఇది ఏ ఒక్క మహిళ సమస్యో కాదు చాలామంది మహిళల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. దీనికి వయస్సుతో సంబంధం లేదు. ఎంత తిన్నప్పటికీ అలసట, నీరసంగా అనిపిస్తే మీ శారీరక శక్తి తగ్గుతోందన్నమాట. శక్తికి తీసుకునే ఆహారానికి సంబంధం లేదు. కొన్ని రకాల వ్యాయామాలు తప్పనిసరి. వాటి గురించి తెలుసుకుందామా...

శారీరకంగా బలంగా తయారవాలంటే కార్డి యో, వెయిట్‌ ట్రైనింగ్‌, ఏరోబిక్స్‌ చేయవచ్చు. ఇవి ఏ వయసు వారైనా చేయవచ్చు. కానీ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ పర్యవేక్షణలో మొదట నేర్చుకుంటే మంచిది. యోగా, ప్రాణయామం వంటివి యోగా మాస్టర్స్‌ దగ్గర నేర్చుకుని ఆ తర్వాత ఇంట్లోనే చేయవచ్చు. వారివారి జీవన విధానాన్ని బట్టి ,సౌకర్యాన్ని బట్టి పై వాటిలో ఏదైనా చేయవచ్చు. రోజుకు పది నిమిషాలు చేస్తే సరిపోదు. రోజుకు కనీసం45 నిమిషాల చొప్పున వారానికి అయిదుసార్లు వ్యాయామాలు చేయాలి. చేస్తున్న వ్యాయావూలకు తోడు తగిన ఆహారం తీసు కోవాలి. అప్పుడే మనం చేస్తున్న వ్యాయమాలకు న్యాయం చేసినవాళ్లమవుతాము. అప్పుడే స్టామినా కూడా పెరు గుతుంది.



కార్బోహైడ్రెడ్స్‌, ప్రోటీన్స్‌, మినరల్స్‌, విటమిన్లతో కూడిన సమతుల్య ఆహారాన్ని తినాలి. రోజుకు కనీసం 10 నుండి 12 గ్లాసులు నీరు తప్పనిసరిగా తాగాలి. ఫిజికల్‌ ఎక్సర్‌సైజులు చేసేవారి శరీరంలోని ద్రవాలు చెమట రూపంలో బయటకు పోతాయి. అందుకే వీలైనంత ఎక్కువగా ద్రవపదార్థాలు, నీరు తీసుకోవాలి. దీనివల్ల శరీరం నుంచి బయటకు వెళ్లిన నీరు తిరిగి చేరుతుంది.



జిమ్‌కు వెళ్లడానికి, పొద్దునే వాకింగ్‌ చేయడానికి కుదరకపోతే యోగా చేయవచ్చు. ఆసనాలు వేసేట ప్పుడు శ్వాస తీసుకునే విధానా లు కూడా ఖచ్చితంగా పాటించా లి. అప్పుడే సరైనా ప్రయోజానా లు కలుగుతాయి. అనులోమ, విలోమాలు, అబ్‌డామినల్‌ ప్రా ణాయామం వంటి వాటివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిదానంగా చేసే యోగాసనాల వల్ల శారీరక దారుఢ్యం పెరుగు తుంది. అయితే యోగ మాత్రం ఏలాంటి ఆహారం తీసుకోకుండా చేయాలి.



వాకింగ్‌ ఆరోగ్యానికి చాలా మంచిది.కానీ పుల్‌ వర్క్‌అవుట్‌కు అది సరిపో దు. అయితే పొద్దున్నే వాకింగ్‌ చేస్తే ఆ రోజంతా ఎంతో తాజాగా ఉంటుంది. చాలామంది మార్నిం గ్‌ వాకింగ్‌చేస్తే ఆ రోజంతా ఎం తో తాజాగా ఉంటారు. చాలా మంది మార్నింగ్‌ వా్‌ను ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. మార్నింగ్ ‌వాక్‌ చేయాలని అనుకుంటే మొ దట పది నిమిషాలతో మొదలు పెట్టాలి. దాన్ని క్రమేణా పెంచుకుంటూ రోజుకు కనీసం అర గంట పాటు చేయాలి. వాకింగ్‌ బాగా అలవాటు అయిన తర్వా త ఆసక్తి ఉంటే జాగింగ్‌ చేయవచ్చు.



మీ ఫిట్‌నెస్‌ ఏ మేరకు వుందో తెలుసుకోవాలంటే ఎవరి దగ్గరికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు మీరే చెక్‌ చేసుకోవచ్చు. మోకళ్ళు వంచకుండా వంగి కాలి వేళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నించండి. పెద్ద కష్టపడకుండా పట్టుకోగలిగితే మీ ఫిట్‌నెస్‌ కు ఎక్కువ మార్కులు వేయొచ్చు. కనీసం మోకాళ్ల దాకా రాగలిగితే ఫరవాలేదు. అదీ కాకపోతే మూడు అంతస్తుల వరకు ఆపకుండా మెట్లు ఎక్కండి. పరిగెత్తనవసరం లేదు. మాములుగా నడిచే విధంగానే ఎక్కండి. మూడో అంతస్తు ఎక్కేసరికి మీరు విపరీతంగా రొప్పుతూ, ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడుతుంటే మీ ఫిట్‌నెస్‌ పై అనుమానం ఉన్నట్లే, అంటే మన శరీరంలో శక్తి తగ్గిపోయిందన్న విషయాన్ని గుర్తించాలి.



సరైన డైట్‌, యోగాలు, వ్యాయామాలు చేసిన తర్వాత కూడా ఇంకా నీరసంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించాలి. వారి సలహా మేరకు పూర్తి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.30 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి మహిళ మూడేళ్లకు ఒకసారి తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రదించాలి.40 దాటాక ఏడాదికొకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి.

No comments: