all

Friday, December 7, 2012

పార్టీ..పెళ్ళి..శుభకార్యాలకు వెళుతున్నారా? ఐతే ఇలా మెరిసిపోండి..

సాధారణంగా మిమ్మల్ని ఈ సీజన్ లో పార్టీకీ కానీ, పెళ్ళికి కానీ ఆహ్వానించినప్పుడు, అక్కడుకు వెళ్ళడానికి రెండు మూడు రోజుల నుండే ప్లాన్ చేసుకొంటారు. పార్టీలకు, శుభకార్యాలకు ఎక్స్ ట్రాడినరీగా ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తారు. చాలా మంది మహిళలు బ్లీచింగ్, ఫేస్ ప్యాక్, వాక్సింగ్, ఐబ్రోస్ ఇంకా ఫేషియల్ వంటివాటికోసం బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు. మీరు ఇన్ స్టాంట్ గ్లో పొందడానికి రోజ్ వాటర్ తో ముఖాన్ని రుద్దడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దాంతో పాటు కొన్ని హోంమేడ్ ఫేస్ ప్యాక్ లను వేసుకోవడం వల్ల మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. పార్టీకీ, శుభకార్యాలకు వెళ్ళేటప్పుడు మరింత ఫ్రెష్ గా, మెరిసిపోతూ, ప్రకాశవంతంగా కనబడాలంటే ఇక్కడ కొన్ని హోం మేడ్ ఫేస్ ప్యాక్ లు మీకోసం....

బనానా ఫేస్ ప్యాక్: అరటి పండుతో వేసుకొనే ఫేస్ ప్యాక్ ల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. చర్మానికి కావల్సిన తేమను అందించడమే కాకుండా, ఇది సూర్యుని తాపాన్ని తగ్గిస్తుంది, సూర్యకిరణాలవల్ల కమిలిన చర్మాన్ని తిరిగి పూర్వ స్థితికి తీసుకొస్తుంది. బనానాతో పాటు కొన్ని ఇతర పదార్థాలు తీసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. బాగా పండిన బానానాకు ఆలివ్ ఆయిల్, రోజ్ వాటర్, కోకో బాటర్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకొని తర్వాత పాలు లేదా గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే మెరిసే, తాజా చర్మం మీ సొంతం అవుతుంది.



కుకుంబర్ ఫేస్ ప్యాక్: మీకు మొటిమలు మరియు మచ్చలు ? పార్టీకి వెళ్ళడానికి ముందుగా ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేయాలి. ఇది మచ్చలను మాత్రమే పోగట్టడమే కాదు. చర్మం తాజాగా కనబడుతుంది. కుకుంబర్ ను చిదిమి అందులో పాలు, నిమ్మరసం వేసి బాగా కలిపి, ముఖాన్ని శుభ్రం చేసుకొన్న తర్వాత ఈ ఫేస్ ప్యాక్ ను అప్లై చేసి, ఇరవై నిముషాల తర్వాత బాగా మర్ధన చేసి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ఇన్ స్టాంట్ గ్లో స్కిన్ మీ సొంతం అవుతుంది.




బొప్పాయి ఫేస్ ప్యాక్: చర్మాన్ని కాపాడటంలో బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. దీని వల్ల తాజా చర్మం మీ సొంతం అవుతుంది. పార్టీలో మీరు మెరిసిపోవాలనుకుంటే ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. బాగా పండిన పప్పాయను చిదిమి అందులో కొన్ని చుక్కల పాలు, నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోయి, తాజా చర్మం తో ముఖం కాంతి వంతంగా మారుతుంది.



ఆలివ్ ఆయిల్ మసాజ్: మీ చర్మం పొడి బారీ ఉన్నట్లైతే కనుక మీరు మేకప్ వేసుకోవడానికి ముందు ఈ మసాజ్ ను ప్రయోగించండి. మీ ముఖంలో ఇన్ స్టాంట్ గ్లో కనబడాలంటే ఆలివ్ ఆయిల్ మసాజ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఫౌండేషన్ కాంపాక్ట్ వంటివి ఉపయోగించడానికి ముందు ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. దాంతో పొడి చర్మ కాస్తా మంచి షైనింగ్ తో మాయిశ్చరైజ్డ్ చర్మం మీ సొంతం అవుతుంది.



మట్టితో మాస్క్: ముల్తానీ మట్టి, శెనగపిండి వంటివాటితో కామన్ గాఫేస్ ప్యాక్స్ వేసుకుంటుంటామం. ఈ ఫేస్ ప్యాక్స్ వల్ల మీ చర్మం ఇన్ స్టాంట్ గ్లో పొందడానికి బాగా సహాయపడుతుంది. అందుకు ముల్తానీ మట్టికి కొద్దిగా రోజ్ వాటర్ మరియు సాండిల్ వుడ్ పౌడర్ లేదా శెనగపిండి, నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దాంతో చక్కటి ఫలితం ఉంటుంది.


No comments: