మన శరీరం కూడా ఒక యంత్రం. అందులో కోటానుకోట్ల జీవక్రియలు ప్రతిరోజూ జరుగుతాయి. ఆ ప్రక్రియల్లో శరీరానికి ఒనగూరాల్సిన ప్రయోజనాలతో పాటు... కీడు చేసే వ్యర్థాలూ విడుదలవుతాయి. ఆ వ్యర్థాలను, విషాలనూ, హానికారక పదార్థాలను నిత్యం వడగడుతూ, బయటకు పంపిస్తూ ఒక కీలక వ్యవస్థను నడిపించే ప్రధాన అవయవాలే మన మూత్రపిండాలు. సగం దెబ్బతినేవరకూ మనిషి ఆరోగ్యంలో ఎలాంటి లక్షణాలూ చూపకుండా పనిచేస్తాయి. అందుకే అవి పూర్తిగా దెబ్బ తినకముందే కాపాడుకోవాలి. అంతటి కీలకమైన మూత్రపిండాలకు వచ్చే కొన్ని ప్రధాన సమస్యలు, వాటి నివారణ, చికిత్స వంటి అనేక అంశాలు తెలుసుకోవడానికి ఉపయోపడేదే ఇవ్వాళ్టి కథనం.
మూత్రపిండాలు రక్తంలోని విషపదార్థాలను, అదనంగా ఉన్న నీటిని క్రమంగా తొలగిస్తుంటాయి. మనకిడ్నీలు ప్రతిరోజూ 200 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి. ఇంతగా పనిచేసే ఈ మూత్రపిండాల పనితీరు క్రమంగా తగ్గడాన్ని దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్-సీకేడీ) అని అంటారు. ఇది చాపకిందనీరులా విస్తరించి, తాను సోకిన విషయమే తెలియకుండా రోగిని దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని ‘సెలైంట్ డిసీజ్’ అని కూడా అంటారు. ఇలా వాటి పనితీరు క్రమంగా తగ్గుతూ ఒక దశలో పనిచేయకుండా పోతాయి. దీన్నే కిడ్నీ ఫెయిల్యూర్‌గా పేర్కొంటారు. దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి... కారణాలు దీనికి మొదటి కారణం మధుమేహం, రెండో కారణం దీర్ఘకాలికంగా ఉండే రక్తపోటు. ఇక సీకేడీకి మూడో కారణం గ్లోమరూలార్ డిసీజ్. ఇది ఉన్నవారిలో మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతుంటుంది. ఫలితంగా కాళ్లవాపు, ముఖం వాచినట్లుగా ఉండటం, మూత్రం నురగలా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఎలాంటి కారణాలు లేకుండానూ కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీలోని మూత్రనాళాలను దెబ్బతీసే ఇంటస్టిషియల్ వ్యాధులు, వంశపారంపర్యమైన జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు సైతం సీకేడీకి కారణం. లక్షణాలు: కాళ్లవాపులు ముఖం వాపు ఆకలి తగ్గడం ఆగకుండా వాంతులు ఎప్పుడూ నీరసంగా ఉండటం ఆయాసం రావడం రాత్రివేళ మూత్రం కోసం ఎక్కువగా నిద్రలేవాల్సి రావడం, అప్పుడు మూత్రం చుక్కలు చుక్కలుగా తక్కువగా రావడం మూత్రంలో రక్తస్రావం... వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కిడ్నీలు 50 శాతం దెబ్బతిన్న తర్వాతే బయటపడతాయి. చికిత్స: రోగి కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్నా కిడ్నీ చేసే విధులను నిర్వహించే డయాలసిస్ అనే ప్రక్రియను నిత్యం చేయించుకోగలిగినప్పుడు కిడ్నీ రోగి సైతం ఒక సాధారణ వ్యక్తి జీవించినంత కాలం, కిడ్నీ వ్యాధిగ్రస్తులూ జీవించవచ్చు. డయాలసిస్‌లో రెండు రకాలు. మొదటిది హీమో డయాలసిస్; రెండోది పెరిటోనియల్ డయాలసిస్. కిడ్నీల రక్షణకు తేలికైన పరీక్షలు... చిన్నప్పుడే వచ్చిన (టైప్-1) మధుమేహ బాధితులు, ఆ వ్యాధి బారిన పడిన ఐదేళ్ల నాటి నుంచి ప్రతి ఏటా కిడ్నీపరీక్షలు ఏవైనా ఉన్నాయేమోనని సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అలాగే పెద్దయ్యాక వచ్చిన (టైప్-2) మధుమేహ బాధితులు దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరును తెలుసుకునే పరీక్షను చేయించుకోవాలి. ఆ తర్వాతినుంచి ప్రతి ఏడాది ఒక్కసారైనా క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్ష చేయించుకుంటూనే ఉండాలి. ఆ తేలికైన పరీక్షలివి... మూత్రంలో ఆల్బుమిన్: ఇది ఒక రకం ప్రోటీన్. ఇది మూత్రంలో సుద్దలా పోతుందంటే కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గినట్లే. అందుకే మధుమేహ బాధితులు ప్రతిఏటా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే. రక్తంలో సీరమ్ క్రియాటినిన్: మన కిడ్నీల వడపోత సామర్థ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగానే కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని (ఎస్టిమేటెడ్ గ్లోమెరూలార్ ఫిల్టరేషన్ రేట్-ఈజీఎఫ్‌ఆర్)ను లెక్కించి, కిడ్నీ సమస్య తలెత్తే అవకాశాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. ఉంటుంది. ఇది 60 మి.లీ. కంటే తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు చేయిస్తూ ఉంటే మూత్రపిండంతో పాటు మనమూ గట్టిపిండంలా ఉంటాం. కిడ్నీలను కాపాడుకోవాలంటే... మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. చక్కెరవ్యాధిగ్రస్తులు ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా హెచ్‌బీ1సీ (గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్) అనే పరీక్షను మూడు నెలలకు ఒకసారి చేయిస్తూ దాని ఫలితం 6.5 కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే రక్తపోటు ఉన్నవారు బీపీని నిత్యం 130/80 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమీ తినకముందు షుగర్ 110 ఎంజీ/డీఎల్ లోపల ఉండాలి. తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేలా చూసుకోవాలి. - రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే... మాంసాహారం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటూ, ఆకుపచ్చని రంగులో ఉండే ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. - ఆహారంలో ఉప్పును పరిమితం చేసుకోవాలి. ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉండే బేకరీ ఆహారాన్ని, పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. - విసర్జన సమయంలో మూత్రంలో సుద్దలా పోతున్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Monday, March 18, 2013
ఆరోగ్యబింబం మూత్రపిండం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment