all

Monday, March 18, 2013

అన్నింట్లో అడుగేయండి !

 

భద్రం బి కేర్‌ఫుల్
మదుపులో కొత్త మార్గాలు అన్వేషించండి. తెలిసిన వాటిలో ఎక్కువగా, తెలియని వాటిలో కొద్దిగా పెట్టుబడి పెట్టడం నేర్చుకోండి. లేకపోతే ఈ ధరల్లో బతకడం కష్టం. డబ్బు సంపాదించడం కంటే, దాన్ని త్వరగా రెట్టింపు చేసుకునే కళ ఇంకా ముఖ్యం.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు: ద్రవ్యోల్బణాన్ని తట్టుకోలేని పొదుపు మార్గం. ముఖ్యంగా ట్యాక్స్ పరిధిలో ఉన్నవారు ఇందులో పెడితే వడ్డీలో మళ్లీ కోతపడుతుంది.

ఆర్బీఐ బాండ్లు: ద్రవ్యోల్బణం మీద కొంచెం మేలు. ఇందులో 20 వేల పెట్టుబడి వరకు పన్ను ఆదా సౌలభ్యం.
చిన్నమొత్తాలు: రికరింగ్ డిపాజిట్లు, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లు, సేవింగ్స్ సర్టిఫికెట్లు తాత్కాలిక పొదుపు మార్గాలు. మరీ తక్కువ మొత్తాలు అయితే వేరే మార్గాల్లో పొదుపు చేయడం కంటే పొదుపు చేయడం మంచిది.

పీపీఎఫ్: దీర్ఘకాలిక పొదుపు మార్గం. పన్ను కట్టక్కర్లేని వడ్డీ. ప్రభుత్వంతో సహా ఎవరూ జప్తు చేయలేని ఆస్తి.
మ్యూచువల్ ఫండ్లు: దీర్ఘకాలానికి మంచి ఆదాయాన్నిచ్చేవి. రిస్కు తక్కువ. అవగాహన పెంచుకుంటే రిస్కు నుంచి తప్పించుకోవచ్చు. సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ) పద్ధతిలో అయితే రిస్కు దాదాపు శూన్యం.

షేర్లు: అలవాటు చేసుకుని, అవగాహన పెంచుకుని, భావోద్వేగాలు అదుపులో ఉంచుకోగలిగిన సామర్థ్యం ఉంటే ఇది వ్యాపారం వంటి ఆదాయాన్ని ఇచ్చేది. ముందుగా పెద్ద కంపెనీలతో మొదలుపెడితే మేలు.
- ప్రకాష్ చిమ్మల
 

No comments: