all

Monday, March 18, 2013

స్టాక్‌మార్కెట్‌లోకి దిగాలంటే ఏం కావాలి?.........టిప్స్

 

 
మిగతా అన్ని పొదుపు మార్గాల్లో బుర్ర మాత్రం వాడితే చాలు. కానీ, స్టాక్స్‌లో భావోద్వేగాలు కూడా ప్రధాన పాత్ర వహిస్తాయి. ముఖ్యమైన సూత్రం... డోంట్ ఫాలో క్రౌడ్ మెంటాలిటీ. అంటే గుంపు మనస్తత్వం పనికిరాదు. అది నష్టదాయకం. అంటే, ఓ షేరు రోజూ పెరుగుతోందని అందరూ కొంటున్నారని మీరూ కొనకూడదు. మనసులో కొనాలని అనిపించినా కూడా దాన్ని అదుపు చేసుకోగలగాలి.

పెరుగుతున్నప్పుడు ఆశను పరిమితం చేసుకుని అమ్మేసే ఉదారత ఉండాలి. తగ్గుతున్నప్పుడు ఇంకెంత పడుతుందో అని భయపడకుండా కొనే ధైర్యం ఉండాలి. మీరు ఆల్రెడీ కొన్న షేరు రెగ్యులర్‌గా పడుతుంటే స్వల్ప నష్టంతో త్వరగా వదిలించుకుని బయటపడే లౌక్యం ప్రదర్శించాలి.

మార్కెట్ బాగా పడినా కుంగిపోవద్దు, బాగా పెరిగిందని పొంగిపోవద్దు. భగవద్గీతలో మనిషి పుట్టటం - గిట్టటం గురించి చెప్పినదాన్ని దీనికి వర్తింపజేసుకోవాలి. మార్కెట్ పెరగడం, పడటం అత్యంత సహజం. కంపెనీలు దివాలాతీస్తే తప్ప (ఉదా: సత్యం స్కాం)మార్కెట్ పడినా పోయేదేం లేదు. కొంతకాలం వేచిచూస్తే నష్టపోకుండా లేదా తక్కువ నష్టంతో బయటపడొచ్చు. బ్రోకరేజి సంస్థలు సూచించినవైనా సరే మీకు కనీస అవగాహన లేకుండా అనామక షేర్లు కొనకండి.
 

No comments: