all

Monday, March 18, 2013

కిడ్నీస్టోన్స్

 

కిడ్నీలో రాళ్లు ఉండడం కూడా ఒకోసారి వాటిని దెబ్బతీసి మూత్రపిండాల వ్యాధికి కారణమవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న కండిషన్‌ను కొన్ని సాధారణ లక్షణాలతో గుర్తించవచ్చు.

కిడ్నీస్టోన్స్ లక్షణాలు...

కోలికీ పెయిన్...

భరించలేని నొప్పి ఉండటాన్ని ఇలా వ్యవహరిస్తారు

హిమచ్యూరియా...

మూత్రంలో రక్తం పడడాన్ని హిమచ్యురియా అంటారు

పైయూరియా...
మూత్రంలో చీము రావడం

డిస్ యూరియా...

విసర్జన సమయంలో మార్గం మంటగా అనిపించడం. చిన్న రాళ్లు మూత్రంతోపాటు వచ్చినప్పుడు లేదా యూరిన్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది

ఆలిగ్యురియా...

మూత్రం పరిమాణం తగ్గడం. యురెథ్రాలో కాని మూత్రాశయంలో కాని లేదా రెండింటిలో కాని రాళ్లు ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు

అబ్డామినల్ డిస్టెన్షస్...

తల తిరగడం, వాంతులవడం ఉంటుంది. వీటితోపాటు చలి, జ్వరం కూడా ఉండవచ్చు

పోస్ట్రిరీనల్ అజోటీమియా...

కిడ్నీలో రాయి యురేటర్‌ని బ్లాక్ చేయడం, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయడం

ఫ్రీక్వెన్సీ ఇన్ మిక్చ్యురిషన్...

ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం. అలాగని రోజుకు రెండున్నర లీటర్లకంటే ఎక్కువ మూత్రవిసర్జన ఉండదు. తక్కువ మోతాదులో విసర్జిస్తూ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం వల్ల ఆహారం తీసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు...

కిడ్నీ స్టోన్స్ చాలావరకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే ఎక్కువగా మూత్రంతో పాటు పడిపోతుంటాయి. రాయి సైజు, రాయి ఉన్న ప్రాంతం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్స నిర్ణయిస్తారు. ఎండోస్కోపీ ద్వారా యురేటర్‌లో రాయిని తీయడం (యూఆర్‌ఎస్‌ఎల్-ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఇన్ ద యురేటర్), ఎండోస్కోపీ ప్రక్రియతో మూత్రపిండం నుంచి రాయిని తొలగించడం (పీసీఎన్‌ఎల్ - ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఫ్రమ్ ద కిడ్నీ) వంటి ప్రక్రియలతో రాయిని తొలగించవచ్చు. రోగి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు, మూత్రపిండాల వ్యవస్థ విఫలమైనప్పుడు, కిడ్నీలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఇష్టపడని రోగులు ఒక నెల రోజులు ఆగి చూసి అప్పటికీ రాయి దానంతట అది పడిపోకపోతే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించాలి. లేకపోతే రాయి వల్ల ఇన్ఫెక్షన్ పాకి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలుంటాయి
 

No comments: