all

Monday, March 18, 2013

కిడ్నీల్లో రాళ్లు రాకుండా జాగ్రత్తలు

 

మూత్రపిండాల్లో వచ్చే రాళ్ల వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు అవసరమైన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంతో పెద్ద ప్రమాదాన్నే నివారించే అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలివి...- నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు తప్పనిసరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది.

- ఆహారంలో ప్రొటీన్, నైట్రోజెన్, సోడియం ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.

- ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి.

- క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి ఆ మేరకు అవి శరీరానికి అందేలా ఆహార నియమాలను పాటించడం మంచిది.

- ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటిశాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఫలితంగా క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ.


- ఆరెంజ్ జ్యూస్‌కు క్యాల్షియం ఆక్సలేట్‌ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పుల్లటి పండ్లతో చేసిన జ్యూస్‌లను ఎక్కువగా తీసుకోకూడదు.

- కూల్‌డ్రింకులను అస్సలు తాగకూడదు.

- కాఫీలోని కెఫీన్ అనే పదార్థం మూత్రంలోని క్యాల్షియం విసర్జనకు దోహదం చేస్తుంది. కాబట్టి తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్‌ని నివారించవచ్చని కొన్ని పరిశీలనలు వెల్లడించాయి.
 

No comments: