all

Monday, March 18, 2013

ఫిట్‌నెస్ కోసం ఏం చేస్తారు?

 

పాంచ్ పటాకా


చార్మి :::

ఈ ఫీల్డ్‌లో ఉన్నాక ఫిట్‌నెస్ కోసం కష్టపడక తప్పదు. నేనైతే వ్యాయామం విషయంలో కాంప్రమైజ్ కాను. క్రమం తప్పకుండా జిమ్‌కి వెళ్తాను. అయితే, ఫిట్‌గా ఉండాలను కుంటాను తప్ప, దానికోసం అవసరాన్ని మించి కష్టపడిపోయే అలవాటు లేదు.

అల్లు అర్జున్ :::

ఫిట్‌నెస్ గురించి జాగ్రత్తగానే ఉంటాను. దాని మీద ప్రత్యేక ధ్యాస పెడతాను. మంచి టోనింగ్ బాడీ అంటే ఆరోగ్యకరమైన ఛాతి, భుజాలు, బెసైప్స్ ఉండటం. అందుకే వాటి మీద ప్రత్యేక దృష్టి పెడతాను. సిక్స్ ప్యాక్ బాగుంటుంది కానీ అదే ఉండాలని అనుకోను. అందమైన బాడీ అంటే సిక్స్ ప్యాక్ ఉండటమే కాదు కదా!

అనుష్క :::

మీకు తెలుసుగా నేను యోగాకే ప్రాముఖ్యతనిస్తానని! పవర్ యోగాను నమ్ముతాను. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగాకు మించి ఏదీ ఉపయోగపడదని నా నమ్మకం. అందుకే వీలైనంతవరకూ ఫిట్‌నెస్ కోసం దానిమీదే ఆధారపడతాను. అప్పుడప్పుడూ జిమ్‌కి కూడా వెళ్తుంటాను.

రామ్ :::

సాయంత్రాలు రెగ్యులర్‌గా జిమ్ చేస్తాను. కండలు పెంచాలని కాదు, ఫిట్‌గా ఉండాలని. డైటింగ్ అస్సలు చేయను. అన్నీ తినేస్తా. కాకపోతే క్వాంటిటీ విషయంలో జాగ్రత్త పడతాను. డ్రైఫ్రూట్స్, స్ప్రౌట్స్ కచ్చితంగా తీసుకుంటాను. రైస్ అస్సలు ముట్టుకోను. రైస్‌లాగే ఉండే కీన్వా అనే దక్షిణమెరికా ఫుడ్‌ని ప్రత్యేకంగా తెప్పించుకుని తింటాను. అందులో ప్రొటీన్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్యాట్ అస్సలు ఉండదు.

శ్రీయ :::

వర్కవుట్ల విషయంలో నేను చాలా స్ట్రిక్ట్. క్రమం తప్పకుండా స్విమ్మింగ్ చేస్తాను. దానివల్ల క్యాలరీలు బాగా ఖర్చయిపోతాయి. ఆటలు కూడా బాగా ఆడతాను. వాటిని మించిన వ్యాయామం ఏముం టుంది! అయితే అంద మనేది మనసు మీద కూడా ఆధారపడి ఉంటుంది. అందుకే ప్రశాంతంగా ఉండటానికి మెడిటేషన్ చేస్తాను. మనసు ప్రశాంతంగా ఉంటే శరీరం అదే బాగుంటుంది!
 

No comments: