మార్పును మనం ఆపలేం. కాకపోతే... ఆ మార్పులో మన ఉనికే కొట్టుకుపోకూడదు అనుకుంటూ ఉంటానెప్పుడూ. మనిషి పుట్టుకతోనే మార్పు మొదలైంది. కానీ పాతికేళ్ల క్రితం వరకు అది మెల్లగా జరి గేది. టెక్నాలజీ ప్రవేశించాక విపరీతంగా స్పీడ్ అందుకుంది. ఇప్పటి జనరేషన్‌ను చూస్తుంటే ఐదారు తరాల మధ్య రావల్సినంత కమ్యూనికేషన్ గ్యాప్... ఒక్క జనరేషన్లోనే వచ్చిందనిపిస్తోంది! దీనికి ప్రధాన కారణం టెక్నాలజీయే. ఇది పల్లెలు, బంధాలు, ఆటలు, మానవ సంబంధాలు అన్నింటి మీదా ప్రభావం చూపింది. నా బాల్యం తలచుకున్నపడల్లా రామా యణ, మహాభారతాలు చూపిన దారిలో నడిచిన సమాజంలో బతికిన చివరి తరం నాదే అని పిస్తుంది. అప్పట్లో వరుసలు పెట్టి తప్ప పేర్లతో పిలవడం చాలా అరుదు. కులం మతం పట్టింపులు ఎన్నున్నా సాధారణ జీవితంలో అవేవీ అంత ప్రభావం చూపేవి కాదు.
మా ఇంటికి వచ్చిన పాలతన్ని మావయ్య అని పిలిచే వాళ్లం. నాకు పెద్దయ్యే వరకు ఆయన పేరే తెలియదు. పాల మావయ్య వచ్చాడనే అనేవాళ్లం. అతనే కాదు... ఊళ్లో అందరినీ ఏదో వరుసతో ఆప్యాయంగా పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు చాలా దగ్గర బంధువులు కూడా మనకు పెద్దయ్యాకే పరిచయం అవుతున్నారు. పిల్లలెప్పుడూ పరీక్షల గురించి వారి టెన్షన్ల గురించి ఆలోచిస్తున్నారు. దీంతో పిల్లల్లో టెన్షన్స్ తప్ప ఎమోషన్స్ లేవు. బంధువులను కలవడం అరుదై పోయింది. అందరూ ఒకచోట కలవాలంటే పెళ్లి వంటి పెద్ద శుభ కార్యమేదో జరగాలి. ఇక చీటికీ మాటికీ వచ్చే పరీక్షలు ఆ పెళ్లిళ్లకెళ్లేందుకు ఎప్పుడూ అడ్డుగానే ఉంటాయి. పొరపాటున వేడకలకు వెళ్లినా అక్కడ పిల్లలకు ఎవరు ఎవరనేది చెప్పాలి. ఇంతకంటే దుర్భరం ఏమైనా ఉంటుందా! బంధువుల గురించి, బంధాల గురించి జీవితాల గురించి పిల్లలతో చర్చించాలి. పురాణాలు, ఇతిహాసాలు మనకు చదువు కోవడం ద్వారా తెలియలేదు. ఒక తరం నుంచి ఒక తరానికి చెప్పుకోవడం వల్ల తెలిశాయి. ఇప్పుడు తల్లిదండ్రులు- పిల్లలు ఎవరు బిజీలో వారున్నారు. చదువులు జీవితంలో భాగంగా లేవు. అవే జీవితం అయిపోయాయి. విచిత్రం ఏంటంటే.. పిల్లలకు- తల్లిదండ్రులకు మధ్య ఇంతకుముందు భయంతో కూడిన దూరం ఉండేది. ఇప్పుడా స్థానంలో ప్రేమ వచ్చింది. ఇది మంచి పరిణామం. కానీ, వారు తల్లిదండ్రులను డిక్టేట్ చేయడానికి, డిమాండ్ చేయడానికి ఆ ప్రేమను ఉపయోగిస్తున్నారు. స్వేచ్ఛ ఇవ్వడమంటే వారేం చెప్పినా వినడం, వారేం చేసినా ఊరుకోవడం కాదు. వారు జీవితమంటే ఏంటో తెలుసుకుంటూ పెరిగేలా చూడటం, తప్పొప్పుల తేడా అర్థం చేసు కుంటూ స్వయంనియంత్రణ అలవాటు చేసుకునేలా చూడటం. ఇప్పుడెంతమంది బామ్మ, తాతయ్యలు మన ఇంట్లోనే ఉంటున్నారు? ఎంతమంది వాళ్ల కళ్ల ముందే పెరిగి పెద్దవుతున్నారు? పల్లెను వదిలేయడం, పట్టణాలకు పోవడం వల్ల సంస్కృతెప్పుడూ నాశనం కాదు. పట్నం రంగు మనం పూసుకోవడం వల్ల మనలో పల్లెతనం, సంస్కృతి పాడవుతుంది. వార సత్వంగా వచ్చిన కట్టూబొట్టును దూరం పెడుతున్నాం. కొత్తదాని మీద మోజు సహజం. కానీ పాతదాని మీద రోత ఎందుకు? ఇంట్లో తల్లిదండ్రులే పిల్లలకు మొట్టమొదటి గురువులు, రోల్‌మోడల్స్. కానీ, వాళ్లేం నేర్పుతున్నారు? పిల్లలను స్కూలుకి, ట్యూషన్లకని తెల్లారుజామున ఐదారు గంటలకే లేపి పంపుతున్నారు. వీళ్లేమో తొమ్మిది గంటలకు నోట్లో బ్రష్ పెడుతున్నారు. మా నాన్నగారు తొంభై రెండేళ్ల వయసులో ఈమధ్యనే పోయారు. నేను ఆయనలా బతకలేకపోయాను. ఏ కాలమైనా సరే, తెల్లవారుజామునే నిద్ర లేచి చన్నీటితో స్నానం చేసి లాల్చీపంచె కట్టుకుని దేవుడికి నమస్కారం చేసుకునే వారాయన. ఆ తర్వాత బయట కూర్చుని పేపరు చదువుకునే వారు. ఆయనలో ఏనాడూ బద్ధకం చూడలేదు. మొక్క నిటారుగా పెరగడానికి కర్రను ఊతంగా కడతాం. ఇంట్లో తల్లి దండ్రులు, స్కూల్లో టీచరు, కాలేజీలో లెక్చరరు పిల్లల జీవితం క్రమశిక్షణగా ఎదగడానికి ఊతంగా ఉండాలి. అంతేగాని, ఎవరు పని వారు యంత్రాల్లా చేసుకుంటూ పోతే సరిపోదు. ఈ మార్పు బంధాల్లోనే కాదు, అన్నింట్లో వచ్చింది. తినే తిండిలో, కాలక్షేపంలో, వ్యాపకాల్లో, డ్రెస్సులో... మా సినిమాల్లో కూడా! ఒకప్పుడు డెరైక్టరు కీలకం. ఇప్పుడు హీరో కీలకం. అప్పట్లో ఒక్క అవకాశం కోసం స్టూడియోలు, నిర్మాతలు- దర్శకుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగేవాళ్లం. అదృష్టం ఉంటే, వారి కంట్లో మనం పడితే, వారి సినిమాలో మనకు సరిపోయే పాత్ర ఉంటే ఎప్పటికో అవకాశం దక్కేది. ఇప్పుడు అందరూ సినిమాలు తీసేస్తు న్నారు. పదిమంది మిత్రులు కలిసి ఓ 5డి కెమెరా కొనుక్కునో, అద్దెకు తీసుకునో... ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా తీసేస్తున్నారు. అవకాశాల కోసం స్ట్రగుల్ లేదు. ఇదీ టెక్నాలజీ పుణ్యమే! ఒక్క మాటలో చెప్పాలంటే, ఇప్పుడు డబ్బులు సంపాదించడం పెద్ద విషయం కాదు, విలువలతో బతకడం, ప్రశాంతంగా బతకడం, మన మనుషుల మధ్య బతకడమే పెద్ద విషయం!! -సంభాషణ: ప్రకాష్ చిమ్మల |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Monday, March 18, 2013
ఆ రోజుల్లో..!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment