all

Monday, March 18, 2013

మినీషా లాంబా

 

 
స్వీట్ ట్వీట్స్ - సేకరణ: సమీర

- మోడల్‌గా మనసులు దోచుకున్న మినీషా, బాలీవుడ్‌లో అడుగుపెట్టి మరింతమంది మనసులను కొల్లగొట్టింది.

- నవ్వుతూ తుళ్లుతూ సరదాగా ఉండే ఆమెలో, చాలా లోతైన భావాలు ఉన్నాయని చాలామందికి తెలియదు.

- ఆమె ట్వీట్స్ చూస్తే ఆ విషయం తెలుస్తుంది.

- మన దేశంలో రోజురోజుకూ బయట పడుతున్న స్కాముల్లో వేల కోట్ల రూపాయలు వెలుగుచూస్తున్నాయి. ఆ డబ్బంతా దేశ అభివృద్ధికి నిజాయితీగా ఖర్చు చేస్తే ఇండియాను నిజంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లగలుగుతాం!

- ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని మానసిక అపరిపక్వతలో నీవున్నప్పుడు, పిరికివాడిగా మారిపోతావు. నిజాన్ని మాట్లాడే సాహసం చేయలేవు. నీ పేరుని దాచి, నువ్వు ఒక వస్తువులా నిశ్చలంగా ఉండిపోవడం తప్ప ఏమీ చేయలేవు!

- నిద్రలో వచ్చే కలను మనం చూడలేం. అయితే... కలలను నిజం చేసుకోకుండా నిద్రపోనూలేం. భలే విచిత్రమైన సమస్య ఇది!

- మొత్తం ఈ ప్రపంచాన్నంతటినీ ఒక మహిళ పరిపాలిస్తే ఎలా ఉంటుంది? అదేమో గానీ... ఒక విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను - అసలప్పుడు యుద్ధాలనేవి ఉండకపోవచ్చు!

- అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే చేస్తున్న ఉద్యమాలను నివారించడానికి ప్రభుత్వం చాలా కష్టపడింది. అదే కష్టాన్ని ఉగ్రవాదాన్ని రూపుమాపడానికెందుకు ఉపయోగించదో!
 

No comments: