all

Monday, March 18, 2013

చేరువైనా... దూరమైనా...నాటి చిన్నారేనా!

 
మొన్నటి సూపర్‌స్టార్ తనయుడిగా అయినా, నిన్నటి మెగాస్టార్ వారసుడిగానైనా... భళా అనిపించాడా బాలుడు. ముద్దొచ్చే రూపానికి, ముచ్చటైన అభినయాన్ని జతచేస్తూ పెద్ద సంఖ్యలో సినిమాలు చేసిన చిన్న కుర్రాడిగా ఘనత దక్కించుకున్నాడు. పచ్చనికాపురాన్ని కాపు కాసిన ఆ బాలాభినయం ఏదీ? స్వయంకృషికి వన్నెలద్దిన ఆ చిన్నారి ఇప్పుడెక్కడ?

అర్జున్ అంటే తెలియకపోవచ్చు కానీ, ‘పచ్చని సంసారం’లో పిల్లాడు, ‘స్వయం కృషి’లో నాన్న చెప్పే మంచిని తలకెక్కించుకోని ఆకతాయి బుడతడు అంటే అంటే ఠక్కున గుర్తొస్తాడు.

అరుణ్.. ఫాదరాఫ్ అర్జున్

విదేశాల నుంచి బెంగళూరుకు వచ్చేటప్పుడు యు.కె.అరుణ్ నటించాలనే ఆసక్తితో ఉన్నారు. ఒకటీ అరా సినిమాల్లో నటించారు కూడా. కెరీర్ పుంజుకోకపోవడంతో నర్తకుడయ్యారు. సంప్రదాయ నృత్యానికి ఫ్యూజన్ శైలిని మేళవించి, ‘స్నో వైట్’ అనే నృత్య శైలికి ప్రాణం పోశారు. సినిమాకు సన్నిహితంగా ఉండాలనే తహతహతో అరుణ్ స్టూడియోస్‌ను స్థాపించారు. నిర్మాణ సంస్థను నెలకొల్పారు.

తండ్రి కోరిక తీర్చడానికే అర్జున్ నటుడ య్యాడు. కన్నడ, తెలుగుతో పాటు 5 భాషల్లో 40 సినిమాలు చేశాడు. నటనకు గ్యాప్ ఇచ్చి, బీబీఎం చేశాడు. ముంబైలో యాక్టింగ్ కోర్సు పూర్తి చేశాడు. నటన, నృత్యాల్లో శిక్షణ తీసుకున్నాడు. కొడుకు ప్రతిభ మీద నమ్మకంతో అరుణ్ జీవితకాలపు సంపాదన పెట్టుబడిగా ఓ చిత్రాన్ని ప్రారంభిస్తు న్నట్టు ప్రకటించారు. కానీ కల నెరవేరకుండానే కన్నుమూశారు. తర్వాత ఆ సినిమా అతీ గతీ లేదు. ప్రస్తుతం అర్జున్ తండ్రి స్టూడియో నిర్వ హణ చేపట్టాడు. దివ్య అనే యువతిని పెళ్లి చేసు కున్నాడు. ఎప్పటికైనా కన్నతండ్రి కలను సాకారం చేసే తీరుతానని, మంచి నటుడిగా రాణిస్తానని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నిన్నటి చైల్డ్‌స్టార్... రేపటి సూపర్‌స్టార్ కావాలని ఆశిద్దాం.
 

No comments: