all

Monday, March 18, 2013

పెళ్లికూతురిని గంపలో ఎందుకు తీసుకొస్తారు?

 

? ఎందుకు - ఔనా ?
పెళ్లికూతురిని గంపలో కూర్చుండబెట్టి పీటల వద్దకు తీసుకురావడమనే సంప్రదాయం ఉంది మనకు. అందరూ కాకపోయినా, కొందరిలో ఈ సంప్రదాయం బలంగా పాతుకుపోయి ఉంది. ఆచారాలు, అలవాట్లు మారిపోవడం వల్ల, ఇప్పుడు కొందరు దీన్ని పాటించడం లేదు. నిజానికి ఈ సంప్రదాయం వెనుక ఎంతో గొప్ప అర్థముంది. ఆడపిల్లల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చింది అంటారు. తమ సిరి అంతా ఆ పిల్లవల్లే కలిగిందని నమ్ముతారు. ఆడపిల్లను బయటికి పంపడమంటే సంపదను పంపడమని అనుకుంటారు. సంపదనొసగేది ఆ శ్రీ మహాలక్ష్మి. ఆవిడ తామరపువ్వులో ఉంటుంది. అదే పై సంప్రదాయానికి మూలం. ఇక్కడ గంప అంటే తామరపువ్వు అన్నమాట. మా శ్రీమహాలక్ష్మిని తామరపవ్వులో పెట్టి మరీ మీకిస్తున్నాము అని వరుడితో చెప్పడానికి ఇది సూచిక.


తలలు బోడులైన తలపులు బోడులగునా...
? ఏమిటి

కన్యాశుల్యం చెలామణీ అవుతున్న రోజుల్లో... ముసలివాళ్లకు పది పన్నెండేళ్ల బాలికలను ఇచ్చి పెళ్లి చేసేసేవారు. తర్వాత కొద్ది కాలానికే భర్తను కోల్పోయేవారు ఆ చిట్టితల్లులు. వారికి తల వెంట్రుకలు తీయించి, తెల్లచీర కట్టించి ఇంట్లోనే ఉంచేసేవారు. వారి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కొందరు సంఘ సంస్కర్తలు... ‘తల వెంట్రుకలు తీయించినంత మాత్రాన వారి మనసుల్లోని యవ్వనపు తలపులు తొలగిపోతాయా, వారినలా అన్నీ చంపుకుని బతకమనడం అన్యాయం కాదా’ అనే ప్రశ్నను లేవనెత్తారు. ఆ మాటే తరువాతి కాలంలో సామెతగా స్థిరపడిపోయింది.
 

No comments: